హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం క్రేజీ కల్యాణం అంటూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అనుపమ ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఇష్టమైన సినిమా గురించి మాట్లాడింది. తనకు హ్యాపీడేస్ మూవీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఆ మూవీ ఇప్పటి వరకు దాదాపు 50 సార్లు చూశానని వెల్లడించింది. ఇప్పటికీ కూడా టీవీలో వస్తే తప్పకుండా చూస్తానని అనుపమ పంచుకుంది.


