పది సినిమాల కంటే.. నాలుగు మంచి సినిమాలు మేలు: కృష్ణ బూరుగుల | Burugu Krishna Upcoming Film Details | Sakshi
Sakshi News home page

పది సినిమాల కంటే.. నాలుగు మంచి సినిమాలు మేలు: కృష్ణ బూరుగుల

Nov 28 2026 6:18 PM | Updated on Nov 28 2026 6:25 PM

Burugu Krishna Upcoming Film Details

సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే.. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే పాత్రలు చేయడమే ముఖ్యమని అంటున్నాడు యువ నటుడు కృష్ణ బూరుగుల. ‘జిగ్రీస్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇకపై కథ, పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పరిగెత్తి పది సినిమాలు చేయడం కంటే.. ఆచితూచి నాలుగు మంచి సినిమాలు చేయడం మంచిదనే ఆలోచనతో ముందుకెళ్తున్నానని కృష్ణ బూరుగుల అంటున్నాడు.

(ఇదీ చదవండి: పాత ఫార్మాట్‌ సినిమా అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు: నాగచైతన్య)

కృష్ణ బూరుగుల గతంలో రెండు, మూడు సినిమాల్లో నటించినప్పటికీ ‘జిగ్రీస్‌’తోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా సహజంగా కనిపించే తన నటన, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ‘జిగ్రీస్‌’ విజయంతో కృష్ణ బూరుగులకు వరుస అవకాశాలు వస్తున్నాయట. అయితే సక్సెస్‌ వచ్చిన వెంటనే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా కథలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడట.

ప్రస్తుతం కృష్ణ బూరుగుల తదుపరి ప్రాజెక్ట్‌లపై ఆసక్తి నెలకొంది. యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఓ ఎంటర్‌టైనర్‌ సినిమాను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కామెడీకి మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. దీంతో పాటు మరికొన్ని కథలు కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement