Egypt: ఘోర అగ్నిప్రమాదం.. 31 మంది సజీవదహనం! | 31 killed after oil tanker catches fire in Egypt | Sakshi
Sakshi News home page

Egypt: ఘోర అగ్నిప్రమాదం.. 31 మంది సజీవదహనం!

Nov 26 2026 7:15 AM | Updated on Nov 26 2026 7:15 AM

31 killed after oil tanker catches fire in Egypt

కైరో: ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమురు ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో సమీపంలో ఉన్న 20కి పైగా కార్లు, ద్విచక్రవాహనాలు మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.

కైరో శివారు ప్రాంతమైన ఇంబాబాలోని వారాక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో చమురు లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం చెలరేగిన మంటలు వేగంగా ఇతర వాహనాలకు వ్యాపించాయి. హైవేపై వెళ్తున్న వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు ఓ కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కార్లలో చిక్కుకున్న వారిని స్థానికులు బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల కోసం మొత్తం 39 అంబులెన్సులను రంగంలోకి దించారు.

గాయపడిన వారిని జాయెద్ స్పెషలైజ్డ్, ఇంబాబా జనరల్, వారాక్ సెంట్రల్ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సీసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు ఏటా వందలాది మందిని బలిగొంటున్నాయి. అతివేగం, రహదారుల నిర్వహణ లోపాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో బెనీ సుయెఫ్ గవర్నరేట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో 21 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి: అమెరికా వాణిజ్య సుంకాలపై భారత్ కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement