24 ఏళ్ల సర్వీసు, ఒక్క ఈమెయిల్‌తో..ఉద్యోగినికి ఊహించని షాక్‌ | 24 Years At Microsoft One Email And An Unexpected Goodbye | Sakshi
Sakshi News home page

24 ఏళ్ల సర్వీసు, ఒక్క ఈమెయిల్‌తో..ఉద్యోగినికి ఊహించని షాక్‌

Nov 24 2026 10:45 AM | Updated on Nov 24 2026 10:50 AM

24 Years At Microsoft One Email And An Unexpected Goodbye

భారీ ఎత్తున చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.  ఈ క్రమంలో దాదాపు పాతికేళ్లుగా సంస్థలో ఎంతో నిబద్దతతో పనిచేసిన  మహిళా ఉద్యోగానికి ఊహించిన పరిణామం ఎదురైంది. ఈ అనుభవాన్ని వివరిస్తూ లారా విలియమ్స్ లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా  చేసిన సుదీర్ఘ పోస్ట్  నెట్టింట చర్చకు దారి తీసింది.

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్లుగా పనిచేస్తున్నారు లారా విలియమ్స్‌. సుదీర్ఘ అనుభవం తర్వాత అనూహ్యంగా ఆమెను తొలగిస్తున్నట్లు ఈమెయిల్ రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర మైన విషయమేమిటంటే, ఐటీ టీమ్స్‌ తమ సొంత డాక్యుమెంటేషన్‌ను తయారు చేసుకోవడానికి AI టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో వివరిస్తూ  90 నిమిషాల  ట్రైనింగ్‌ సెషన్ నిర్వహిస్తున్న  సమయంలో  ఈ  మెయిల్ ఆమెకు వచ్చింది. "సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్ రంగంలో నా 24 ఏళ్ల కెరీర్‌కు ఇదొక బలమైన ముగింపు లాగా అనిపిస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. శిక్షణా సెషన్ జరుగుతుండగానే "హై ప్రయారిటీ బిజినెస్ అప్‌డేట్" (High Priority Business Update) పేరుతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్‌కు ఆహ్వానం అందిందని ఆమె తెలిపారు.  సెప్టెంబర్ 22న మైక్రోసాఫ్ట్ చేపట్టిన తొలగింపుల్లో ఆమె ఉద్యోగం కోల్పోయారు. నవంబర్ 22న కంపెనీలో ఆమెకు  లాస్ట్‌ వర్కింగ్‌ డే. ఈ సందర్భంగా తన  24 ఏళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన సహోద్యోగులకు, మేనేజర్లకు, తన భర్తకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె పోస్ట్‌కు లింక్డ్‌ఇన్ వినియోగదారుల నుండి భారీ స్థాయిలో మద్దతు లభించింది.

లింక్డ్‌ఇన్ వినియోగదారుల స్పందన
24 ఏళ్ల అనుభవం అద్భుతమైన ప్రయాణం. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్,  డాక్యుమెంటేషన్‌లో మీ అనుభవం ఎంతో విలువైంది అంటూ చాలామంది ఆమెకు ధైర్యం చెప్పారు.  మైక్రోసాఫ్ట్ తర్వాత కూడా జీవితం ఉంది. మనమందరం గతంలో కంటే మెరుగైన స్థానానికి చేరుకుంటాం అని ఒకరు వ్యాఖ్యానించారు

ఇలాంటి పోస్ట్‌లు చూస్తుంటే పెద్ద కంపెనీలు ఉద్యోగుల తొలగింపుల విషయంలో ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాయని అర్థమవుతోంది. లారా వంటి ప్రతిభావంతురాలిని తొలగించడం బాధాకరమని  ఇంకొకరు అభిప్రాయపడ్డారు.

కాగా గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్ పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులను తగ్గిస్తోంది. జూలై నెలలో ఎక్స్‌బాక్స్ (Xbox)  ఇతర విభాగాల నుండి సుమారు 4,800 మందిని (మొత్తం సిబ్బందిలో దాదాపు 2 శాతం) తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో  కూడా మరోసారి వందలాది మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement