‘దురంతో’పై రాళ్ల దాడి.. ఏసీ కోచ్‌ అద్దం ధ్వంసం! | Mumbai Bound Duronto Express Comes Under Stone Pelting Attack Near Nagpur | Sakshi
Sakshi News home page

‘దురంతో’పై రాళ్ల దాడి.. ఏసీ కోచ్‌ అద్దం ధ్వంసం!

Nov 24 2026 10:36 AM | Updated on Nov 24 2026 10:36 AM

Mumbai Bound Duronto Express Comes Under Stone Pelting Attack Near Nagpur

ముంబై: మహానగరం ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. నవంబర్‌ 23న నాగ్‌పూర్‌లోని మనీష్‌ నగర్‌ సమీపంలో అజ్ని రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని ఏ2 ఏసీ కోచ్‌ కిటికీ బయటి అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులెవరూ గాయపడలేదు. రైలు ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగలేదు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వార్ధా రైల్వే స్టేషన్‌ సమీపంలో అద్దానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గత నెలలోనూ నాగ్‌పూర్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌పై బోర్‌ఖేడీ స్టేషన్‌ దాటిన తర్వాత రాళ్ల దాడి జరిగింది. అప్పట్లో ఏ1, బీ2, బీ5 కోచ్‌ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనూ ఎవరికీ గాయాలు కాలేదు.
 

రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినా అనుమానితుల ఆచూకీ లభించలేదు. మరో ఘటనలో సూరత్‌ సమీపంలో ముంబై-అహ్మదాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై కూడా రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ అదే రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా దాడిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అంతటా కార్తీక పౌర్ణమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement