అంతటా కార్తీక పౌర్ణమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు! | Festival Bring Faith and Positivity pm modi | Sakshi
Sakshi News home page

అంతటా కార్తీక పౌర్ణమి వేడుకలు.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు!

Nov 24 2026 10:14 AM | Updated on Nov 24 2026 10:14 AM

Festival Bring Faith and Positivity pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం నిస్వార్థ సేవ, భక్తి, విశ్వాసం, సానుకూలతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో భక్తిభావాన్ని, సానుకూల ఆలోచనలను పెంపొందించాలని ఆకాంక్షించారు.
 

కాశీలో భక్తజన సందోహం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి దశాశ్వమేధ ఘాట్‌ వద్ద వేలాది మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అయోధ్యలో సరయూ నది, హరిద్వార్‌లోని హర్‌కీ పౌడీ ఘాట్‌ వద్ద కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు చేశారు.


 

ఆత్మశుద్ధికి పవిత్ర స్నానం

 

కార్తీక మాసం ఏడాదిలోనే అత్యంత పవిత్రమైన మాసమని పూజారి పండిట్‌ యశ్‌కుమార్‌ శర్మ తెలిపారు.

కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేయడం వల్ల ఆత్మ ప్రక్షాళన జరుగుతుందని, ఈ మాసం విష్ణుమూర్తి, పరమశివుడికి ప్రీతికరమైనదని పేర్కొన్నారు.


పూరీలో జగన్నాథుడి దర్శనం కోసం..

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం వద్ద వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.

హర్యానాలోని యమునానగర్‌ కపాల్‌ మోచన్‌ సరోవర్‌ వద్ద పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గురునానక్‌ జయంతి సందర్భంగా కపాల్‌ మోచన్‌ మేళా కూడా నిర్వహించారు.


విశ్వనాథుడికి దీపమాల అలంకరణ

వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అక్టోబర్‌ 26 నుంచి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజూ సప్తఋషి హారతి సమయంలో ప్రత్యేక దీపమాల అలంకరణ చేస్తున్నారు.

దీపాల కాంతులతో స్వామివారి అలంకరణ భక్తులకు కనువిందు చేస్తోంది.


దేశవ్యాప్తంగా కార్తీక శోభ

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో దీపాలు వెలిగించడం, జాతరలు నిర్వహించడం, భజనలు, ప్రార్థనలు చేయడం ఆనవాయితీ.

నీటిపై దీపాలతో అలంకరించిన చిన్న పడవలను వదులుతూ భక్తులు పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement