ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సౌరవ్‌ దాస్‌కు షాక్‌! | CJPs Saurav Das Claims He Was Stopped At Delhi Airport | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సౌరవ్‌ దాస్‌కు షాక్‌!

Nov 24 2026 7:41 AM | Updated on Nov 24 2026 7:41 AM

CJPs Saurav Das Claims He Was Stopped At Delhi Airport

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్‌ దాస్‌ సంచలన ఆరోపణలు చేశారు. లండన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో తనను అడ్డుకున్నారని సోమవారం రాత్రి ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమే తన విదేశీ పర్యటనను అడ్డుకుందని ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు.
 

ఆక్స్‌ఫర్డ్‌తో పాటు కేంబ్రిడ్జి, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎల్‌ఎస్‌సీ), ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయాల నుంచి తనకు ఆహ్వానాలు అందాయని దాస్‌ తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో ‘కాక్రోచ్‌ ఉద్యమం’ గురించి ప్రసంగించాల్సి ఉందన్నారు. అయితే, ఈ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ఉద్దేశించి తాను మాట్లాడటం ప్రభుత్వానికి ఇష్టం లేకపోవడంతోనే ప్రయాణాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. తనను విమానం ఎక్కనివ్వకుండా నిలిపివేశారని వీడియో సందేశంలోనూ పేర్కొన్నారు.

సీజేపీ వ్యవస్థాపకుడి మద్దతు
సౌరవ్‌ దాస్‌ ఆరోపణలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మద్దతుగా నిలిచారు. ఆక్స్‌ఫర్డ్‌లో జరిగే సదస్సులో ప్రసంగించేందుకు దాస్‌కు ఆహ్వానం అందిందని తెలిపారు. ఆయనకు వచ్చిన ఆహ్వానాన్ని చూసి అధికారంలో ఉన్నవారు అసూయపడుతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే, సౌరవ్‌ దాస్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. విమానాశ్రయంలో ఆయనను ఎందుకు అడ్డుకున్నారనే అంశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఒవైసీకి సెల్యూట్‌ చేయించిన అధికారిపై వేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement