breaking news
saurav das
-
‘వాస్తవాన్ని చూపండి’ అంటూ యువతకు ‘సీజేపీ’ సౌరభ్ కీలక పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పాఠశాలల పరిస్థితులను పరిశీలించేందుకు కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరభ్ దాస్ నేతృత్వంలో ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం ప్రారంభమైంది. పాఠశాలల్లో పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో చదువుతున్నారో పరిశీలించి, వాటిని నమోదు చేయనున్నట్లు దాస్ తెలిపారు.మంగళవారం నోయిడాకు వచ్చిన దాస్ మాట్లాడుతూ.. నగరంలోని కొన్ని పాఠశాలలను బృందం పరిశీలించనుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నోయిడాను మెరుగైన జిల్లాల్లో ఒకటిగా పరిగణిస్తారని, అక్కడి పాఠశాలల పరిస్థితి కూడా అందుకు తగ్గట్టుగానే ఉందో లేదో తమ పరిశీలనలో తేలుతుందని అన్నారు. “ఈరోజు మేం నోయిడాకు వచ్చాం. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలను తనిఖీ చేయబోతున్నాం. పిల్లలు చదువుతున్న పరిస్థితులను చూస్తాం. పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని మీకు చూపిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలోని యువత వారి వారి ప్రాంతాల్లోని పాఠశాలలను కూడా పరిశీలించాలని దాస్ కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, పిల్లలకు ఎలాంటి విద్య అందుతోంది? అన్న విషయాలను స్వయంగా పరిశీలించి నమోదు చేయాలని పిలుపునిచ్చారు.సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమాన్ని ఆగస్టులో దేశవ్యాప్తంగా సామాజిక తనిఖీ కార్యక్రమంగా ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రాథమిక సదుపాయాలను పరిశీలించడమే దీని ఉద్దేశమని పార్టీ తెలిపింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొలి తనిఖీ జరిగింది. అక్కడ తాగునీరు, బెంచీలు, మరుగుదొడ్ల పరిశుభ్రత, పగిలిన కిటికీలు, నీటి సరఫరా వంటి సమస్యలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రస్తావించారు.తదుపరి తనిఖీల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే సామగ్రి వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. నోయిడా తనిఖీల ఫలితాలు, ఇతర ప్రాంతాల్లో యువత చేపట్టే పరిశీలనలు ఈ కార్యక్రమానికి తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.This is a primary school in Noida, a city supposed to be one of the most prosperous in entire UP.Sincere appeal to our UP politicians—stop the Hindu-Muslim politics. FIX OUR GOVT SCHOOLS!@Cockroachisback pic.twitter.com/f4vBwr5aqC— Saurav Das (@SauravDassss) September 15, 2026🚨After just ONE school inspection, UP government ordered all government schools in Gautam Buddha Nagar to be CLOSED today. Watch this video.As you can see, classes were going on. Children were inside. Teachers were very kind with us. However, the Noida administration called… pic.twitter.com/gsXc3OO7M5— Saurav Das (@SauravDassss) September 15, 2026 -
సోషల్ మీడియాలో ‘సీజేపీ’ సౌరవ్ దాస్ అడ్రస్.. వారికి సమన్లు
న్యూఢిల్లీ: తన అనుమతి లేకుండా నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో యాంకర్ అభిజిత్ అయ్యర్-మిత్రతో పాటు పలు మీడియా ప్లాట్‌ఫాంలకు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.వ్యక్తిగత సమాచారం బయటపెట్టారన్న ఆరోపణలపై మధ్యంతర రక్షణ కోరుతూ దాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. దాస్ నివాస చిరునామా ఉన్న పోస్టులను ఎక్స్ తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. న్యాయమూర్తి సచిన్ దత్తా నోటీసులు జారీ చేసి, ప్రతివాదులు తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 14న జరగనుంది.దాస్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ వాదిస్తూ.. ‘ది పాంఫ్లెట్’కు చెందిన సిబ్బంది అనుమతి లేకుండా తన క్లయింట్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి ఒక వీడియో చిత్రీకరించారని తెలిపారు. అయ్యర్-మిత్ర ఆ వీడియోకు మరిన్ని దృశ్యాలను జత చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని సిబల్ ఆరోపించారు. ఎక్స్‌లోని కొన్ని పోస్టుల్లో దాస్ నివాస చిరునామాను ప్రత్యేకంగా పేర్కొన్నారని కూడా ఆయన తెలిపారు.ఎక్స్‌లో ఇంకా ఉన్నాయా? తన క్లయింట్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ, ఎక్స్ తన విధానం ప్రకారం ఇప్పటికే తొలగించిన పోస్టులను తిరిగి అందుబాటులోకి తీసుకురాకుండా చూడాలని సిబల్ కోర్టును కోరారు. ఎక్స్ తరఫున హాజరైన న్యాయవాది, సంబంధిత లింకులు "ఇకపై అందుబాటులో లేవు" అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను కోర్టు నమోదు చేసింది.‘ది పాంఫ్లెట్’ తరఫు న్యాయవాది కూడా పోస్టులు ఎక్స్‌లో ఇక అందుబాటులో లేవని తెలిపారు. ఆరోపణలపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వడానికి సమయం కోరారు. 3 రోజుల్లో ప్రతివాదుల వివరాల పత్రం, వ్యాజ్య పత్రాన్ని సవరించుకునేందుకు అనుమతించింది.అయ్యర్-మిత్ర, ‘ది పాంఫ్లెట్’తో పాటు లాబీట్, ‘ది జైపూర్ డైలాగ్స్’, ‘ది సండే గార్డియన్’, గూగుల్ ఎల్ఎల్సీ, ఎక్స్ కార్ప్‌లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన గోప్యత, గౌరవం, భద్రతకు భంగం కలిగిందని ఆరోపిస్తూ, ప్రతివాదులపై శాశ్వత, తప్పనిసరి నిషేధాజ్ఞలతో పాటు నష్టపరిహారం చెల్లించాలని దాస్ కోరారు.తన అనుమతి లేకుండా తన నివాస చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ప్రచారం చేశారని దాస్ తన పిటిషన్లో ఆరోపించారు. తన కచ్చితమైన చిరునామా బయటపడటం వల్ల తనకు, తన నివాసంలో ఉండే ఇతరులకు భద్రతాపరమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.తాను నివసించే నివాస ప్రాంగణంలోకి ‘ది పాంఫ్లెట్’ ప్రతినిధులు ప్రవేశించి, ఇంటి లోపలి భాగాలతో సహా ఆస్తికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారని దాస్ ఆరోపించారు. ఆ దృశ్యాలను తర్వాత ఎక్స్‌లో పోస్టు చేశారని తెలిపారు. -
‘అద్భుతమైన జెన్ జీ ముఖాలు’.. సీజేపీ సౌరవ్ దాస్ సెటైర్లు
న్యూఢిల్లీ: దేశంలోని జెన్ జీకి చేరువయ్యేందుకు బీజేపీ మొదలు పెట్టిన కార్యక్రమం, అందుకోసం ఎంపిక చేసిన నేతలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆదివారం విమర్శలు చేసింది. “అద్భుతమైన జెన్ జెడ్ ముఖాలను ఎంపిక చేసిన బీజేపీకి మూడు చప్పట్లు” అంటూ ఎక్స్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సెటైర్లు వేశారు. దేశ యువతను గతంలో “వైరస్, కాక్రోచ్” అని, వారిని “టుక్డే టుక్డే గ్యాంగ్”తో పోల్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.“జెన్ జీను ‘చేరువ చేసుకునేందుకు’ బీజేపీ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నితిన్ నబిన్ ఇటీవల యువతరాన్ని ‘వైరస్, కాక్రోచ్’ అని, నిరసనకారులను ‘టుక్డే టుక్డే గ్యాంగ్’లో భాగమని అన్నారు” అని దాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యువతతో సంబంధాలను బలోపేతం చేసేందుకు బీజేపీ కొత్తకార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని శనివారం ఏర్పాటు చేయడంతో దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.“బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి, ఛత్తీస్‌గఢ్ మంత్రి ఓపీ చౌదరి సహా పలువురు నేతలను ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన బృందంలో చేర్చారు” అని ఏఎన్ఐ తెలిపింది.స్మృతి ఇరానీపై కూడా దాస్ విమర్శలు చేశారు. ఆమెను రెండేళ్లలోనే విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ఎందుకు తప్పించారో “గూగుల్‌లో వెతకాలని” అన్నారు. “యేల్ యూనివర్సిటీ”గా ఆయన పేర్కొన్న సంస్థ నుంచి ఆమె పొందిన డిగ్రీపైనా ప్రశ్నలు లేవనెత్తారు.“ఇక స్మృతి ఇరానీ... సరే సరే... 2016లో రెండేళ్లలోనే ఆమెను విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ఎందుకు తప్పించారో గూగుల్‌లో వెతకండి. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ఆమె నిర్వహించిన తీరు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయడం, ‘యేల్ యూనివర్సిటీ’ నుంచి ఆమె పొందిన డిగ్రీపై ఉన్న సందేహాలు.. ఇవన్నీ యువతకు ఉపన్యాసాలు ఇచ్చే గొప్ప నైతిక అధికారం ఆమెకు కల్పిస్తున్నాయి” అని దాస్ చురకలంటించారు.బీజేపీ జెన్ జీ కార్యక్రమంశనివారం నబిన్ కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ బృందం తొలి పరిచయ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ కార్యాలయ బాధ్యతలు చేపట్టిన కొత్త టీమ్ పనికి ఈ సమావేశంతో అధికారికంగా శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా యువ ఓటర్లతో మరింత ప్రత్యక్షంగా, నిరంతరంగా సంబంధాలు పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ త్వరలో జెన్ జీ చేరువ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారుజెన్ జీ ఆకాంక్షలు, ఆందోళనలు, అంచనాలను అర్థం చేసుకోవడంపై ఈ కార్యక్రమం దృష్టి పెట్టే అవకాశం ఉంది. యువతకు బీజేపీ నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు, తమను ప్రభావితం చేసే అంశాలపై అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఇవ్వనున్నారు. చర్చలు, పరస్పర సమావేశాలు, ఇతర కార్యక్రమాల ద్వారా యువ ఓటర్లతో సంబంధాలను బలోపేతం చేసి, యువ తరంలో పార్టీ చేరువను విస్తరించడమే లక్ష్యంగా బీజేపీ భావిస్తోంది. సమావేశంలో కొత్తగా నియమితులైన పార్టీ బాధ్యులు “యువ సంవాద్”కు, అంటే యువతతో నిరంతర సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలని నబిన్ సూచించారు.ఇదీ చదవండి: ప్రపంచం ముందు భారత్ తలెత్తుకు నిలబడేలా.. 4 నెలల్లో.. -
సీజేపీ దాస్ ఇంటికి పోలీసులు.. బీజేపీ ప్లాన్ మార్చిందా?
పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసులు వెళ్లడం వివాదానికి దారితీసింది. పోలీసులు తమ కుటుంబాన్ని ప్రశ్నల పేరుతో భయబ్రాంతులకు గురిచేశారని దాస్ ఆరోపించగా.. పోలీసు శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చేపట్టే సాధారణ భద్రతా చర్యల్లో భాగంగానే ఇంటికి వెళ్లామని స్పష్టం చేసింది.పోలీసులు తమ కుటుంబం వద్దకు వచ్చి రకరకాల ప్రశ్నలు అడిగారని దాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఇది కేవలం సాధారణ విచారణ కాదని, తనను మౌనం చేయించేందుకు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఎందుకు భయపెడుతోందని దాస్ ప్రశ్నించారు. ఈ చర్య వెనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అసలు ఇలాంటి విచారణకు చట్టపరమైన ఆధారం ఏమిటని నిలదీశారు. తనను బెదిరించి మౌనం చేయించాలని చూస్తే అది సాధ్యం కాదని, ఇలాంటి చర్యలు తమ పోరాట సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.అంతేకాదు, రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుదుచ్చేరికి వచ్చి అక్కడి హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన విషయాన్ని కూడా దాస్ ప్రస్తావించారు. ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని సందర్శించే నిర్ణయం తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. అయితే, పోలీసుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దాస్ బంధువుల ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం నిజమేనని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి వేధింపులు, బెదిరింపులు లేవని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన రోజులకు ముందు భద్రతా చర్యల్లో భాగంగా కీలక మార్గాల సమీపంలో నివసించే ప్రజల ఇళ్లను పోలీసులు సందర్శించడం సాధారణమేనని చెప్పారు.#Alert🚨Two hours ago, the Pondicherry Police showed up at my family’s home and subjected them to all kinds of questioning. Why this harassment, @PuducheryPolice? Who ordered this and for what purpose? Is this the legal procedure? Why is the BJP government in Pondicherry…— Saurav Das (@SauravDassss) August 12, 2026ముఖ్యమైన రూట్లకు సమీపంలో నివసించే ప్రజలను కలిసి కొన్ని వివరాలు తెలుసుకోవడం, భద్రతకు సంబంధించిన సాధారణ ప్రశ్నలు అడగడం పోలీసుల రొటీన్ ప్రక్రియలో భాగమని అధికారి వివరించారు. దీంతో ఒకే ఘటనపై రెండు భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. దాస్ మాత్రం దీన్ని రాజకీయ బెదిరింపుగా చూస్తుండగా.. పోలీసులు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు చేపట్టే సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమని చెబుతున్నారు. ఇక దాస్ చేసిన వ్యాఖ్యలు పుదుచ్చేరి రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అమిత్ షా పర్యటనను ఈ ఘటనతో ముడిపెడుతూ ఆయన ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ కోణం కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పుదుచ్చేరిలో హాట్ టాపిక్‌గా మారింది. -
'మొయిత్రాకు ఏమైనా జరిగితే ఆ జడ్జిదే బాధ్యత'
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను కాక్రోజ్ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తప్పుబట్టారు. మహువా మొయిత్రాపై సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఆమెకు ఏదైనా ముప్పు వాటిల్లితే ఇదే న్యాయమూర్తులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి న్యాయమూర్తులు రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.గుడ్లు విసురుతారని భయపడితే ఎలా?వివాదాస్పద ఫేస్బుక్ పోస్టుల కేసులో పోలీసుల విచారణకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన సొంత నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సమయంలో తనపై గుడ్లు విసిరే అవకాశం ఉందని, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం.. శుక్రవారం తిరస్కరించింది. దర్యాప్తు అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై విచారణకు సహకరించాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.“మీరు పార్లమెంట్ సభ్యురాలు కదా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోడిగుడ్ల దాడులకు భయపడుతున్నారా? మన స్వాతంత్ర్య సమరయోధులు తూటాలకు ఛాతీలను ఎదురొడ్డారు. ఇలాంటి దరఖాస్తులు ఈ కోర్టు ముందుకు రావాల్సిన అవసరమే లేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, మహువా మొయిత్రాపై నమోదైన కేసులో ఆమెకు ఎలాంటి వేధింపులు జరగకుండా భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఇప్పటికే ఆదేశించింది.న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఆందోళనకరంమహువా మొయిత్రాపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌లో సౌరవ్ దాస్ స్పందించారు. “అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహువా మొయిత్రా బుల్లెట్లను ఎదుర్కొవాలని కోరుకుంటున్నారా? న్యాయమూర్తులుగా ఇలా బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తులను నియమించుకున్నాం? న్యాయమూర్తుల నుంచి మనం ఆశించే న్యాయపరమైన ఔన్నత్యం ఇదేనా?, ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న దుస్థితి గురించి తెలిసిన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళనకరం. తన ప్రవర్తనకు న్యాయమూర్తి సిగ్గుపడాలి. భవిష్యత్తులో మహువా మొయిత్రాకు ఏదైనా హాని జరిగితే అందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసే వ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తులు రాజీనామా చేయాల్సి వచ్చేది లేదా అభిశంసనను ఎదుర్కోవాల్సి వచ్చేద''ని వ్యాఖ్యానించారు. So does this Supreme Court judge want @MahuaMoitra to take bullets? What kind of motormouth persons have we appointed as judges? Is this the judicial temperament we expect of constitutional court judges? This is why we need to fix judicial accountability. The statement is… pic.twitter.com/O2w8KQoGQL— Saurav Das (@SauravDassss) August 7, 2026చదవండి: పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?మొయిత్రాపై కేసు ఏమిటి?పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా హోగల్బరియా పోలీస్ స్టేషన్లో జూన్‌లో బీజేపీ నేత హీరక్ భట్టాచార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా, సామాజిక- మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా, మత విశ్వాసాలను అవమానించేలా, ప్రజల్లో అశాంతికి దారితీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.కృష్ణనగర్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల కొందరు బీజేపీ మహిళా కార్యకర్తలు గుమిగూడిన ఘటన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. గతంలో నమోదైన మరో కేసులో మహువా మొయిత్రా కోర్టుకు హాజరయ్యే సమయంలో ఆమెపై గుడ్లు, టమాటాలు విసురుతామని వారు హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటన అనంతరం మొయిత్రా ఫేస్బుక్లో రెండు వీడియోలు పోస్టు చేశారు. మొదటి వీడియోలో కోర్టు వెలుపల గుడ్లతో కనిపించిన మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టులను, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నారు.మరుసటి రోజు పోస్టు చేసిన మరో వీడియోలో ఆ మహిళలందరి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తానని ఆమె చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గుడ్లు బహిరంగంగా విసరకుండా బుర్ఖా ధరించి గుర్తుపట్టకుండా విసరాలని ఆమె సూచించినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె వ్యాఖ్యలు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉన్నాయని బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్‌గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్‌కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్‌లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal— Saurav Das (@SauravDassss) December 19, 2015సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు.


