ఎమర్జెన్సీలో కూడా ఇలా ప్రవర్తించలేదు | Cockroach Janta Party Sourav Das Fires On Narendra Modi Government | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే అణచివేత: సౌరవ్ దాస్

Oct 11 2026 3:06 PM | Updated on Oct 11 2026 3:28 PM

Cockroach Janta Party Sourav Das Fires On Narendra Modi Government

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై అణచివేతకు పాల్పడుతోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్ దాస్ ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు తమకు నిర్బంధ నోటీసు ఇవ్వకుండా, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, న్యాయవాదిని సంప్రదించేందుకు కూడా అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు.

"జెన్‌జీ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులపై వేధింపులు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బంగ్లా సాహిబ్ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారు. యువత శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సౌరవ్ దాస్.. 2024 ఎన్నికలకు సంబంధించి జ్ఞానేశ్ కుమార్ వద్ద ఏదైనా కీలక సమాచారం ఉందా? అందుకే ప్రభుత్వం ఆయనను కాపాడుతోందా?" అని ప్రశ్నించారు.

"ఎమర్జెన్సీలో కూడా ఇలా ప్రవర్తించలేదు. శాంతియుతంగా నిరసన చేస్తున్న యువతను అరెస్టు చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై దాష్టీకంగా ప్రవర్తించారు. వేలాదిమంది యువతపై దాడులు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా రైళ్లు నిలిపివేయలేదు. ఆందోళనకారులపై కేంద్ర ప్రభుత్వం నిరంకువంగా ప్రవర్తిస్తోంది. గతంలో ఎమర్జెన్సీ గురించి మాత్రమే విన్నాం.. కానీ ఇప్పుడు మోదీ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. శాంతియుతంగా నిరసన చేసే హక్కు పౌరులకు లేదా..?" అంటూ సీజేపీ ప్రతినిధి సౌరభ్‌ దాస్‌ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించే వరకు వెనక్కి తగ్గేది లేదు: సీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement