కోర్టు వెలుపల హత్యాయత్నం.. కత్తులతో దాడి, కాల్పులు | Man Hand Chopped Off With Machete, Then Shot Outside Pune Court | Sakshi
Sakshi News home page

కోర్టు వెలుపల హత్యాయత్నం.. కత్తులతో దాడి, కాల్పులు

Nov 25 2026 3:30 PM | Updated on Nov 25 2026 3:30 PM

Man Hand Chopped Off With Machete, Then Shot Outside Pune Court

పూణే: మహారాష్ట్రలోని పూణేలో కోర్టు వెలుపల హత్య కేసు నిందితుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడి చేయి తెగిపోయింది.

మందార్ మారుతి కివ్లే అనే వ్యక్తి కోర్టు విచారణకు హాజరైన సమయంలో ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం కాల్పులు జరిపి స్కూటర్లపై పరారయ్యారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భూమి, ఆర్థిక వివాదం కారణంగా 2025 ఏప్రిల్‌లో శుభం సుభాష్ చవాన్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో కివ్లే జైలుకు వెళ్లాడు. నాలుగు రోజుల క్రితమే విడుదలయ్యాడు. తరువాత మరో రోజున కోర్టుకు వచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఈ దాడిలో మందార్ మారుతికి తీవ్ర గాయాలవడంతో అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: విజయ్‌ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement