చెల్లి హత్యకేసులో జీవిత ఖైదు | Man Gets Death Sentence For Sister's Murder, Jumps From 5th Floor | Sakshi
Sakshi News home page

చెల్లి హత్యకేసులో జీవిత ఖైదు

Nov 24 2026 5:37 AM | Updated on Nov 24 2026 5:37 AM

Man Gets Death Sentence For Sister's Murder, Jumps From 5th Floor

కోర్టుపై నుంచి దూకి ఆత్మహత్య 

థానే కోర్టులో నాటకీయ పరిణామాలు

థానే: మహారాష్ట్రలోని థానే న్యాయస్థానంలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హత్య కేసులో 28 ఏళ్ల వ్యక్తికి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పునివ్వడం.. జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తూండగానే ఆ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని... పరుగెత్తుకుంటూ న్యాయస్థానం ఉన్న ఐదో అంతస్తు నుంచి దూకి మరణించడం క్షణాల్లో జరిగిపోయాయి. 

నగేశ్‌ బాబు లాడ్‌ అనే ఈ దోషి 2019లో తన చెల్లిని హత్య చేసినట్లు, భార్యను చంపబోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన భార్య, బావమరుదులు ఇద్దరు అక్రమ సంబంధం కలిగి ఉన్నారని నగేశ్‌బాబు అనుమానిస్తూండేవాడు. ఈ నేపథ్యంలో 2019 జూలై 17న నవీ ముంబైలోని భార్య పుట్టింట్లో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత పారిపోయి చెల్లి ఇంట్లో తలదాచుకున్నాడు. ఆ చెల్లి నగేశ్‌ బాబును సముదాయించే ప్రయత్నం చేసింది. 

ఈ క్రమంలో వదినకు మద్దతుగా మాట్లాడింది. దీంతో అతడు చెల్లిపైనా వెంటనే కత్తితో దాడి చేశాడు. ఛాతీపై పదే పదే పొడవడంతో ఆమె మరణించింది. భార్యపై జరిగిన హత్యా యత్నాన్ని ప్రాసిక్యూషన్‌ రుజువు చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అది హత్య ఉద్దేశంతో చేసిన దాడేనని నిర్ధారించింది. బాధితురాలు ప్రాణాలతో బయటపడినప్పటికీ హత్యాయత్నంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. నగేశ్‌ చెల్లి సునీత హత్య కూడా అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ద్వారా అతడే చేసినట్లుగా తెలుస్తోందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement