breaking news
fifth floor
-
టైమ్స్ స్క్వేర్ భవనం ఐదో అంతస్తులో మంటలు
ముంబై: ముంబైలోని తూర్పు అంధేరి పట్టణంలో టైమ్స్ స్క్వేర్ భవనం ఐదవ అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని కాసేపటికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ భవనంలో చాలావరకూ కార్పొరేట్, ఐటీ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ భవనంలో ఉన్న వారు ఎవరికీ గాయాలు కాలేదు. -
ఐదో అంతస్తు నుంచి జారి పడిన మహిళ
మాచవరం(విజయవాడ): కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో అరుణ అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి విజయలక్షి్ష్మ అనే మహిళ జారిపడింది.అయితే అదృష్టవశాత్తు మూడో అంతస్తు గ్రిల్స్‌లో కాలు విరుక్కుపోయింది. ఈ విషయం గమనించిన స్థానికులు 108, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాధితురాలిని రక్షించారు. అయితే ఈ ఘటనలో ఆమె కు స్వల్పగాయాలయ్యాయి. -
బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
కొల్కతా: దక్షిణ కొల్‌కత్తాలోని జవహర్లాల్ నెహ్రూ రోడ్డులోని బహుళ అంతస్తుల భవనం అయిదవ అంతస్తులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది... ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడినట్లు కానీ... భవనంలో ఎవరైన చిక్కుని ఉన్నారనే దానిపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ఈ భవనంలో అనేక కార్యాలయాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.


