దక్షిణ కొల్కత్తాలోని జవహర్లాల్ నెహ్రూ రోడ్డులోని బహుళ అంతస్తుల భవనం అయిదవ అంతస్తులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.
కొల్కతా: దక్షిణ కొల్కత్తాలోని జవహర్లాల్ నెహ్రూ రోడ్డులోని బహుళ అంతస్తుల భవనం అయిదవ అంతస్తులో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది... ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడినట్లు కానీ... భవనంలో ఎవరైన చిక్కుని ఉన్నారనే దానిపై సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ఈ భవనంలో అనేక కార్యాలయాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.


