సాక్షి సంగారెడ్డి: పోతిరెడ్డి పల్లిలో శ్రద్ధ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని స్కూలు బిల్డింగులో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్కూట్ అయ్యిుండచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ రోజు మున్సిఫల్ ఎన్నికలు కావడంలతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థిులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.


