హైదరాబాద్, లక్డీకాపూల్: 16 ఏళ్ల వర్ధమాన క్రికెటర్‌కు అతని తండ్రి మూత్రపిండాన్ని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఈ వివరాలు గురువారం యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున వెల్లడించారు. మలక్‌పేటకు చెందిన బాలుడు చిన్నప్పటినుంచీ విరాట్ కోహ్లీని ఆరాధిస్తూ బౌలర్‌గా రాణిస్తున్నాడు. అయితే పుట్టుకతోనే మూత్రనాళ సమస్యతో బాధపడుతున్నాడు. ’ప్రీ–ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్’ చేయాలని ఏఐఎన్‌యూ వైద్యులు సూచించారు. బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్ తన ఒక మూత్రపిండాన్ని కుమారుడికి దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ మల్లికార్జున నేతృత్వంలో శస్త్రచికిత్స నిర్వహించారు.


