సాక్షి, మహబూబ్‌నగర్: భూత్పుర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ బస్సు డివైడెర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదసమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


