హైదరాబాద్‌కు చెందిన అమన్‌దీప్‌పై రాజ్‌కోట్‌లో కేసు నమోదు
నెలకు 4 శాతం రాబడి పేరుతో మోసం చేశారంటూ ఆరోపణలు
నిందితుల జాబితాలో జునాగఢ్‌కు చెందిన రాజీవ్ శర్మ పేరు సైతం
సాక్షి, హైదరాబాద్: ఇదో చిత్రమైన కేసు... 15 ఏళ్ల క్రితం జరిగిన రూ.71.89 లక్షలకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు గుజరాత్‌లో తెరపైకి వచ్చింది. నెలకు నాలుగు శాతం చొప్పున రాబడి పేరుతో ఈ మొత్తం తీసుకుని మోసం చేశారంటూ అక్కడి రాజ్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో శనివారం కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అమన్‌దీప్ సింగ్ ఠాకూర్‌తో పాటు జునాగఢ్‌కు చెందిన రాజీవ్ శర్మ కూడా ఉన్నారు. అక్కడి ప్రముఖ ఆడిట్, ఆర్థిక సలహాదారు పరేష్ మెన్‌పరా ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఈ కేసు దర్యాప్తు కోసం త్వరలోనే రాజ్‌కోట్ పోలీసులు హైదరాబాద్ చేరుకోనున్నారు.
ప్రాథమిక సమాచార నివేదికలోని (ఎఫ్‌ఐఆర్) అంశాల ప్రకారం... 2011లో ఓ సంస్థకు ఆడిట్ నిర్వహిస్తున్న సమయంలో రాజీవ్ శర్మతో బాధితుడు పరే‹Ùకు పరిచయం ఏర్పడింది. జునాగఢ్‌లోని గుజరాత్ ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (జీఐడీసీ) పరిధిలోని వెట్‌టెల్ కమోడిటీస్ లిమిటెడ్ సంస్థలో పెట్టుబడి పెట్టాలంటూ సూచించిన శర్మ అహ్మదాబాద్‌కు చెందిన ప్రణవ్ షా, చింతన్ షాలను పరిచయం బాధితుడికి చేశాడు.
ఈ ద్వయం తమ ప్రాజెక్టుకు సంబంధించి పరే‹Ùకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. తాను ఆ సంస్థ ఏజెంట్‌నని శర్మ చెప్పడంతో పాటు పెట్టుబడిపై నెలకు నాలుగు శాతం రాబడితో పాటు లాభాల్లో 60 శాతం వాటా ఇస్తామని నిందితుడు హామీ ఇచ్చినట్లు పరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్టుబడి మొత్తాన్ని బంగారం, వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో వినియోగిస్తామని ఆ సమయంలో వాళ్లు చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత సంస్థ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన అమన్‌దీప్ సింగ్ ఠాకూర్‌ను పరిచయం చేశారు.
పెట్టుబడికి బ్యాంకు హామీ ఇప్పిస్తామని శర్మ భరోసా ఇవ్వడంతో పరేష్ రూ.71.89 లక్షలు పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించారు. 2011 సెప్టెంబర్ 14న వీరి మధ్య దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఎంఓయూ కూడా రాసుకున్నారు. అనంతరం తన డబ్బుతో అమన్‌దీప్ సింగ్ ఠాకూర్‌తో ట్రేడింగ్ నిర్వహించగా, జునాగఢ్ నుంచి శర్మ ఆ సంస్థ కార్యకలాపాలను నిర్వహించినట్లు పరేష్ ఆరోపించారు. అయితే హామీ ఇచ్చిన మేరకు లాభాలతో పాటు పెట్టుబడి కూడా తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు శర్మను సంప్రదించారు.
ఈ సమయంలో అమన్‌దీప్ సింగ్ ఠాకూర్ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాడని శర్మ హామీ ఇచ్చినట్లు బాధితుడు రాజ్‌కోట్ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే నగదు తిరిగి చెల్లిస్తున్నానంటూ అమన్‌దీప్ సింగ్ ఠాకూర్ రెండు చెక్కులు జారీ చేశారు. అయితే ఆ బ్యాంకు ఖాతాల్లో నిధులు లేని కారణంగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితుడు పరేష్ దీనిపై 2012 మార్చి 17న నెగోíÙయబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఎన్‌ఐ) చట్టం కింద నోటీసు జారీ చేశారు. దీనిపైనా నిందితుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తాజాగా రాజ్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: ఖైరతాబాద్‌లో దిమ్మతిరిగే రిజల్ట్స్.. దానం సంచలన వ్యాఖ్యలు


