అది ముమ్మాటికీ ఫార్మా సిటీయే.. : కేటీఆర్‌ | KTR Future City Pharma City BRS Hyderabad Politics | Sakshi
Sakshi News home page

అది ముమ్మాటికీ ఫార్మా సిటీయే.. : కేటీఆర్‌

Sep 28 2026 9:26 AM | Updated on Sep 28 2026 9:27 AM

KTR Future City Pharma City BRS Hyderabad Politics

సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

మరో రెండేళ్లలో వచ్చేది కేసీఆర్‌ సర్కారే

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: ‘ఉన్న సిటీలో దోమలమందు కొట్టే దిక్కులేదు కానీ ఫ్యూచర్‌ సిటీ అంటున్నారు.. ఫ్యూచర్‌ సిటీ లేదూ గాడిద గుడ్డూ లేదు. అది ముమ్మాటికీ హైదరాబాద్‌ ఫార్మాసిటీయే. అది ఇంకేదానికీ వాడుకోడానికి చట్ట ప్రకారం చెల్లదు. పెట్టుబడిదారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరో రెండేళ్లలో వచ్చేది కేసీఆర్‌ సర్కారే’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

శంషాబాద్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో మణికొండకు చెందిన పలువురు నాయకులు ఆ పారీ్టలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. గణేష్‌ ఉత్సవాల్లో పదిరోజులుగా ఓ పెద్దాయనకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఓ సినిమా వచ్చి మరింత నిద్ర పట్టకుండా చేసిందన్నారు. ప్యారడైజ్‌ సినిమా మొత్తం ఒక ఎత్తు.. నాలుగు నిమిషాల కేసీఆర్‌ పాత్ర ఒక ఎత్తు అన్నారు.

మన గొంతును.. మన జాతిని మేల్కొల్పిన నాయకుడి పోరాటాన్ని దర్శకుడు అందులో స్పృశించారని పేర్కొన్నారు. అధికారానికి మాత్రమే దూరమయ్యాయం కానీ కేసీఆర్‌ అంటే ప్రజల్లో ప్రేమాభిమానాలు తగ్గలేదన్నారు. ప్రస్తుత సర్కారు మూసీ ప్రక్షాళన పక్కనపెట్టి భూములు, ఇళ్లు గుంజుకునే పనిలో పడిందని కేటీఆర్‌ విమర్శించారు. హైడ్రాకు పేదోళ్ల ఇళ్లు తప్ప మంత్రులు పొంగులేటి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలు నీళ్లలో కట్టిన ఇళ్లు మాత్రం కనపడటం లేదని దుయ్యబట్టారు.

శంషాబాద్‌ ఘాంసిమియాగూడ, సుల్తాన్‌పల్లి భూముల కోసమే రేవంత్‌రెడ్డి పంచన చేరావనే విషయం తెలుసు అని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి,  శ్రీనివాస్‌ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సిరిసిల్ల లెక్కలు తేల్చాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement