సకాలంలో పూర్తి చేస్తాం
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేసింది. పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్‌వాసులు కోరుతున్నారు.
రూ.32 కోట్లు మంజూరు
అమృత్–2.0 పథకంలో భాగంగా మున్సిపాలిటీకి రూ.32 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో అవసరమైన వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, తాగునీటి సరఫరాకు పైప్‌లైన్లు, ఇంటింటికీ నల్ల కనెక్షన్ ఇవ్వాలి. గతేడాది ఆగస్టులో ప్రారంభించిన ఈ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మున్సిపల్ పరిధిలో ఐదు వాటర్ ట్యాంకులు, 52 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు, 2,500 నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పనుల వివరాలు
● బీసీ కాలనీ, గుర్రంగుట్ట కాలనీ, నుగులబండ కాలనీ, ముర్తుజపల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో ఒక్కో వాటర్‌ట్యాంక్ నిర్మిస్తున్నారు.
● పట్టణంలో మూడు ట్యాంక్‌ల నిర్మాణం పనులు కొనసాగుతుండగా ముర్తుజపల్లి, జంగారెడ్డిపల్లిలో నత్తనడకన సాగుతున్నాయి.
● 52 కిలోమీటర్లకు గాను 27 కిలో మీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. పనులన్నీ డిసెంబర్ లోగా పూర్తి చేయాల్సిఉంది.
పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చేపట్టిన అమృత్–2.0 పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య ఎప్పుడు దూరమవుతోందనని ఎదురు చూస్తున్న మున్సిపల్‌వాసులకు నిరీక్షణ తప్పడం లేదు.
నత్తనడకన 2.0 పనులు
తాగునీటికి ఇబ్బంది పడుతున్న మున్సిపల్‌వాసులు
పనులు వేగిరం చేయాలని డిమాండ్
అమృత్–2.0 పథకంలో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తిచేస్తాం. వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణం, పైప్‌లైన్‌ల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. గడువులోపు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– రాఘవేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆమనగల్లు


