రిజిస్ట్రేషన్లు! | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్లు!

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

తహసీల్దార్‌పై

ఎమ్మెల్యే ఆగ్రహం

ఫాంల్యాండ్స్‌ రిజిస్ట్రేషన్లు నిలిపేశాం

గుట్టుగా గుంటల్లో

యాచారం: తహసీల్దార్‌ కార్యాలయం వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో పలు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు డిమాండ్‌ ఏర్పడింది. నందివనపర్తి, కొత్తపల్లి, నస్దిక్‌సింగారం, అయ్యవారిగూడెం, చింతుల్ల, గునుగల్‌, చౌదర్‌పల్లి, యాచారం, మల్కీజ్‌గూడ, నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో పలు రియల్‌ కంపెనీలకు చెందిన వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఎకరా ధర రూ.కోటి నుంచి రూ.మూడు కోట్లకు పైగా డిమాండ్‌ ఉంది. యాచారం తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలో నిత్యం 20కి పైగానే వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలకు స్లాట్లు బుక్‌ అవుతున్నాయి. బుక్‌ అయిన స్లాట్లల్లో అత్యధికంగా రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లే ఉంటున్నాయి. రియల్‌ వ్యాపారులు రిజిస్ట్రేషన్లకు వస్తున్నారంటే తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి పెద్ద పండుగ. రియల్‌ వ్యాపారులకు రాచ మర్యాదలు చేసి చకచక రిజిస్ట్రేషన్లు చేసి రికార్డులను వారి చేతుల్లో పెట్టి పంపిస్తున్నారు. రైతుల రిజిస్ట్రేషన్లు ఉంటే మాత్రం సాకులు చెప్పి గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మార్కెట్‌ విలువ పెంచి స్లాట్‌ బుకింగ్‌

వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్న రియల్‌ వ్యాపారులు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువ కంటే ఐదారు రెట్లు మార్కెట్‌ విలువ పెంచి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. మార్కెట్‌ విలువ పెంచి స్లాటు బుక్‌ చేసుకోవడంతో సర్కార్‌కు ఆదాయం వస్తున్నప్పటికీ.. ఆ కిటుకుతో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. ఎకరాకు రూ. కోట్లల్లో ధరలు పలికే నందివనపర్తి, నస్దిక్‌సింగారంకొత్తపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములకు రియల్‌ వ్యాపారులు మార్కెట్‌ విలువ పెంచి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అలాంటి వ్యాపారులు వస్తే పలు సాకులు చూపి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ముడుపులు చెల్లించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 19న తహసీల్దార్‌ కార్యాలయ కంప్యూటర్‌ అపరేటర్‌ చారి విధులకు హాజరు కాలేదని దీంతో రిజిస్ట్రేషన్లు జరగవని అధికారులు రైతులకు చెప్పి పంపించారు. రైతులంతా వెళ్లిపోయాక ఓ రియల్‌ వ్యాపారి కోసం సాయంత్రం ఆరు గంటల తర్వాత అపరేటర్‌ చారిని కారులో ప్రత్యేకంగా రప్పించి ఆ వ్యాపారికి రిజిస్ట్రేషన్‌ చేసి పంపించారు. వ్యాపారికి రిజిస్ట్రేషన్‌ చేసిన విషయమై పలువురు రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు.

యాచారం తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది పనితీరుపై ఆదివారం మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు తొర్రూర్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి ఫిర్యాదులు చేశారు. అధికారులు రియల్‌ వ్యాపారులకు కొమ్ముకాస్తు సామాస్య రైతులను పట్టించుకోవడం లేదని తెలిపారు. మొండిగౌరెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం లేదని ఫిర్యాదులు చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్‌ అయ్యప్పకు ఫోను చేసి మీరు మారారా.. సామాన్య రైతులు సమస్యలు పట్టించుకోకుండా.. రియల్‌ వ్యాపారులకు ఊడిగం చేస్తారా అంటు మండిపడ్డారు. ఈ ఆరు నెలల కాలంలో రైతుల నుంచి వచ్చిన భూ సమస్యలు ఎన్ని.. మీరు పరిష్కరించినవి ఎన్ని అని ప్రశ్నించారు. ఇంత వరకు ఏఏ గ్రామాల్లో ఫాంల్యాండ్స్‌కు గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేశారు, అనే పూర్తి వివరాలతో సోమవారం సాయంత్రం లోగా తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు.

రియల్టర్లకు రాచమర్యాదలు చేస్తున్నారంటూ ఆరోపణలు

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన యాచారం తహసీల్‌ కార్యాలయం

తహసీల్దార్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన రైతులు

ఫాంల్యాండ్స్‌ రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. గుంటల్లో వ్యవసాయ భూముల స్లాట్లు బుక్‌ చేయవద్దని మీ సేవల యజమానులకు ఆదేశాలిచ్చాం. రైతులకు అత్యవసర పరిస్థితులుంటే ఆర్‌ఐల ద్వారా విచారణ చేయించి నిజమని తెలితే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. రైతుల భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.

– అయ్యప్ప, తహసీల్దార్‌, యాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement