పాలక్ పత్రా..
కావలసినవి:
పాలకూర: 200 గ్రా.,
శనగపిండి: ఒకటిన్నర కప్పులు,
బియ్యప్పిండి: పావుకప్పు,
రవ్వ: అరకప్పు,
మజ్జిగ: పావుకప్పు,
కారం: 2 టీస్పూన్లు,
ధనియాల పొడి: 2 టీస్పూన్లు,
పసుపు: టీస్పూన్,
నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు,
అల్లం–వెల్లుల్లి–పచ్చిమిర్చి పేస్ట్: టేబుల్ స్పూన్,
బెల్లం: రెండు టేబుల్ స్పూన్లు,
నిమ్మరసం: టీస్పూన్, గరం మసాలా– టీస్పూన్,
వాము: టీస్పూన్, చిటికెడు ఇంగువ, తగినంత ఉప్పు నూనె
తయారీ:
- మజ్జిగలో మసాలా పదార్థాలు, బెల్లం, నిమ్మరసం, నూనె వేసి కలపాలి.
- శనగపిండి, బియ్యప్పిండి, రవ్వ వేసి చిక్కటి పిండిలా చేయాలి.
- పాలకూర ఆకులపై పిండిని పలుచగా పూసి ఒకదానిపై ఒకటి పేర్చి గట్టిగా చుట్టాలి.
- ఈ రోల్స్‌ను 12–15 నిమిషాలు ఆవిరిపై ఉడికించి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి.
- పాన్ లో నూనె వేడి చేసి ముక్కలను మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా కరకరలాడేలా వేయించాలి. అంతే క్రిస్పీ పాలక్ పత్రా రెడీ!
రైస్ పాప్స్
కావలసినవి:
అన్నం: కప్పు,
ఉడికించిన బంగాళదుంప: ఒకటి,
కారం: అర టీస్పూన్,
ఉప్పు: తగినంత,
జీలకర్ర: అర టీస్పూన్,
కొత్తిమీర: కొద్దిగా,
నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ:
- అన్నాన్ని ఒక గిన్నెలో వేసి మెత్తగా మెదపాలి.
- అందులో ఉడికించిన బంగాళ దుంపను బాగా చిదుముకుని కలిపి ముద్దగా చేసుకోవాలి.
- ఈ ముద్దలో కారం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కొద్దిగా ఒత్తాలి.
- కడాయిలో నూనె వేడి చేసి, ఈ ఉండలను బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
- బయటకు తీసి టిష్యూపై ఉంచితే అదనపు నూనె తగ్గుతుంది. అంతే కరకరలాడే వేడివేడి రైస్‌పాప్స్ రెడీ!
లెమన్ ఇడియప్పం..
కావలసినవి:
బియ్యప్పిండి: కప్పు,
నీరు: ఒకటిన్నర కప్పులు,
నూనె: టీ స్పూన్,
ఉప్పు: సరిపడా,
తాలింపు కోసం: నూనె, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు,
నిమ్మరసం: ఒక నిమ్మకాయ నుంచి తీసినది,
వేయించిన వేరుశెనగపప్పు: పావు కప్పు,
తురిమిన కొబ్బరి: టేబుల్ స్పూన్.
తయారీ:
- బియ్యప్పిండిని దోరగా వేయించి పక్కన పెట్టాలి.
- నీటిలో నూనె, ఉప్పు వేసి మరిగించి, బియ్యప్పిండిలో పోసి కలపాలి.
- చల్లారిన తర్వాత మెత్తని పిండిలా చేసి ఇడియప్పం అచ్చుతో ఇడ్లీ ప్లేట్లలో ఒత్తి పది నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.
- పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, పప్పులు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపుతో తాలింపు వేయాలి.
- అందులో ఇడియప్పం ముక్కలు, వేరుశెనగపప్పు, కొబ్బరి వేసి కలపాలి.
- చివరగా నిమ్మరసం కలిపితే రుచికరమైన లెమన్ ఇడియప్పం సిద్ధం.
ఇదీ చదవండి: కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న!


