దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌..! | Aishwarya Rutuparna Pradhan: Indias First Transgender Civil Servant | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌..!

Sep 27 2026 3:55 PM | Updated on Sep 27 2026 4:22 PM

Aishwarya Rutuparna Pradhan: Indias First Transgender Civil Servant

ట్రాన్స్‌జెండర్స్‌ సమాజంలో ఎలాంటి వివక్ష ఎదుర్కొంటున్నారో తెలిసిందే. కొందరు తమకంటూ గుర్తింపు కోసం ఆరాటపడుతూ..మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా డాక్టర్‌, లాయర్‌ వంటి పలు వృత్తులను చేపట్టారు. కానీ అత్యున్నత ఐఏఎస్‌ పదవిని మాత్రం ఓ ట్రాన్స్‌జెండర్‌ అలంకరించి..తనలాంటి ఎందరికో ప్రేరణగా నిలిచింది. ఆమె కూడా చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కోని ఎన్నో కష్టాలు పడి ఆ స్థాయికి చేరుకుందామె. 

ఆ మహిళే ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్‌. ఒడిశాలోని చిన్నగ్రామానికి చెందిన ఆమె కంధమాల్‌ జిల్లాలో రతికాంత్‌గా జన్మించింది. పుట్టుకతో అబ్బాలయిగా ఉన్నా ఆ అమ్మాయి ఎదిగే కొద్ది..తనలోని మార్పులతో అమ్మాయిలే ప్రవర్తించేవాడు. దాంతో చిన్నతనం నుంచి లింగ వివక్షను ఎదుర్కొంది. పాఠశాల రోజుల నుంచి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలు ఆమె చదువుని సజావుగా సాగనివ్వకుండా చేశాయి. 

అయినా సరే ఆమె చదువుపైనే దృష్టి పెట్టేది. ఉన్నత విధ్య కోసం భువనేశ్వర్‌కు వెళ్లి..అక్కడ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చదువులు పూర్తి చేసి, ఆ తర్వాత  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC)లో ఇంగ్లీష్ జర్నలిజం అభ్యసించింది. అలాగే కళాశాల హాస్టల్‌ల్లో కూడా తన గుర్తింపు కారణంగా వసతి విషయమై చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అయినప్పటికీ తన చదువుని కొనసాగించి..ప్రజా సేవలో తన వృత్తి నిర్మిచుకోవడానికి కృషి చేసింది. అంతేగాదు తన గుర్తింపుని అంగీకరించేందుకు సిద్ధపడి అమ్మాయిలా ఉండటం మొదలు పెట్టింది. 

అందుకు తల్లి, చెల్లి మద్దతు ఇచ్చారు. అలాగే 2014లో భారత సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను మూడవ లింగంగా గుర్తించడంతో..ధైర్యంగా తన గుర్తింపును  బహిర్గతం చేసింది ఐశ్వర్య. అంతేగాదు 2010లో ఒడిశా ఫైనాన్షియల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఎంపికైంది. అక్కడితో ఆగిపోకుండా ప్రతిష్టాత్మకైన సివిల్‌ సర్వీస్‌కు సన్నద్ధమై గెలిచి ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యింది. 

అయినప్పటికీ తన సహోద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. కానీ వాటిని ఆమె బేఖాతారు చేస్తూ ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతూ వారి గళం వినపించేలా ప్రచారకర్తగా మారిందామె. అంతేగాదు తన కమ్యూనిటీ సమాజానికి స్ఫూర్తిగా నిలిచింది. ఐశ్వర్య కథ గెలిచినోడి వైపు యావత్తు ప్రపంచం చూస్తుంది, అతడి బాధ వింటుంది మార్పుకి నాంది పలుకుతుంది అనేందుకు నిదర్శనం కదూ..!.

ఇదీ చదవండి: ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో టీచర్‌ ఉద్యోగం..! ఏకంగా 27 ప్రయత్నాల తర్వాత..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement