ఇరాన్‌లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ? | Iran Mojtaba Khamenei pulled from rubble after hospital strike | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?

Sep 27 2026 12:52 PM | Updated on Sep 27 2026 1:21 PM

Iran Mojtaba Khamenei pulled from rubble after hospital strike

మొదట దాడి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలింపు.. అక్కడ కూడా బాంబుల మోత.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీ చుట్టూ ఇప్పుడు మరో సంచలన కథనం తెరపైకి వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో గాయపడిన ఆయనను టెహ్రాన్‌లోని ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత నగరంలోని మూడు ఆస్పత్రులపై దాడులు జరిగాయని ఇరాన్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ సభ్యుడు మొహ్సెన్‌ హెయ్‌దారీ చెప్పినట్లు ‘న్యూయార్క్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది. మూడో ఆస్పత్రి శిథిలాల నుంచి మోజ్తబా ఖమేనీని బయటకు తీసి, అనంతరం గుర్తుతెలియని ప్రాంతానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైంది. శిథిలాల నుంచి బయటపడిన తర్వాత మోజ్తబా ఖమేనీ ఎక్కడ ఉన్నారన్నది స్పష్టంగా తెలియడం లేదని హెయ్‌దారీ చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఇప్పటికే భిన్న కథనాలు ఉన్నాయి. అమెరికా వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ కొన్ని నివేదికలు ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నాయి. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ మాత్రం ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. మోజ్తబా ఖమేనీతో తాను సుదీర్ఘంగా సమావేశమై చర్చలు జరిపినట్లు పెజెష్కియాన్‌ వెల్లడించారు.

అంటే.. ఒకవైపు ఆస్పత్రి శిథిలాల నుంచి బయటకు తీసినట్లు ఓ ఇరాన్‌ అధికారి చెబుతున్న వాదన.. మరోవైపు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఇరాన్‌ అధ్యక్షుడి ప్రకటన. దీంతో అసలు మోజ్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎంపికైన విధానంపైనా హెయ్‌దారీ కీలక వివరాలు వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. మార్చి 8న అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ సమావేశంలో ఆయన పేరును ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఖోమ్‌లోని అసెంబ్లీ సెక్రటేరియట్‌పై దాడి జరిగిందని, ఎనిమిది మంది మరణించారని ఆయన ఆరోపించినట్లు సమాచారం.

దాడిలో ఎంపికకు సంబంధించిన పత్రాలు ధ్వంసమైన నేపథ్యంలో సభ్యులు తమ ఓట్లను కాగితాలపై నమోదు చేసి, అనంతరం రహస్య గదిలో సమావేశమైనట్లు ఆయన చెప్పినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 59 మంది సభ్యుల్లో 50 మంది మోజ్తబా ఖమేనీకి మద్దతు పలికినట్లు, ఎనిమిది ఓట్లు అయతుల్లా అలీరెజా అరాఫీకి వచ్చినట్లు, ఒకరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: మేమంతా చనిపోయే వాళ్లం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement