గ్యాస్‌ లీకేజీతో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనం | 2 Us Couple Died In Blast In Athens Building | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకేజీతో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనం

Sep 27 2026 10:51 AM | Updated on Sep 27 2026 10:51 AM

2 Us Couple Died In Blast In Athens Building

ఏథెన్స్‌: గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ప్లాకా జిల్లాలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.30 గంటలకు జరిగిన పేలుడులో ఒక పాత రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు అమెరికన్లు గాయపడ్డారు. 30 మంది అగ్నిమాపక సిబ్బంది భవన శిథిలాలను తొలగించి ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు.

గ్రీకు నాగరికతకు నిదర్శనంగా నిలిచే ప్రాచీన ఆక్రోపొలిస్‌ కట్టడానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఆ భవనంలో గ్యాస్‌ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించి ఉంటుందని ఏథెన్స్‌ మేయర్‌ హ్యారిస్‌ డౌకాస్‌ అభిప్రాయపడ్డారు. అయితే పేలుడుకు అసలైన కారణాలు దర్యాప్తు తర్వాతే తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి సమీప భవనం సైతం పాక్షికంగా ధ్వంసమైంది.

ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement