ప్రభుత్వ సైట్లతో ఏఐ ముచ్చట్లు!  | OpenAI reveals its agents accessed some USA government websites | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సైట్లతో ఏఐ ముచ్చట్లు! 

Sep 27 2026 5:27 AM | Updated on Sep 27 2026 5:27 AM

OpenAI reveals its agents accessed some USA government websites

శాన్‌ఫ్రాన్సిస్కో: తాము అభివృద్ధి చేసిన ఏఐ ఏజెంట్లు అనూహ్య రీతుల్లో అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లతో సంప్రదింపులు జరిపినట్లు ఓపెన్‌ ఏఐ ప్రకటించింది. కంపెనీ ఏఐ మోడళ్లపై సమీక్ష సందర్భంగా ఈ విషయం బయటపడినట్లు తెలిపింది. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజి కమిషన్‌ (ఎస్‌ఈసీ), యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటాలు నడుపుతున్న రెండు వెబ్‌సైట్ల సమాచారాన్ని ఏఐ మోడళ్లు వీక్షించాయని ఓపెన్‌ ఏఐ తెలిపింది. 

అయితే ఏఐ మోడళ్లు ఎస్‌ఈసీ క్రెడెన్షియల్స్‌ను, అకౌంట్లను కానీ ఏఐ మోడళ్లు ఉపయోగించలేదని, సమాచారంలో మార్పులు జరిగిన ఆనవాళ్లూ లేవని, వైబ్‌సైట్‌లో సెక్యూరిటీ పరమైన లోటుపాట్లు కూడా ఏవీ లేవని తేలిందని వివరించింది. ఏఐ మోడళ్లు మానవ నియంత్రణ నుంచి తప్పిపోయి ఇతర వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయగలవన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో ఓపెన్‌ ఏఐ ఈ ప్రకటన చేయడం గమనార్హం.  

ఏఐ మోడళ్లు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌ నుంచి సేకరించిన సమాచారాన్ని ఇంకో వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశాయని, ఈ చర్య అనూహ్యమైందని ఓపెన్‌ ఏఐ తెలిపింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఏఐ మోడళ్లు డేటాను చేయకూడని సమయంలో ప్రసారం చేశాయని తెలిపింది. సుమారు 53 సార్లు ఏఐ మోడల్‌ యూజర్‌ యాక్టివిటీకి సంబంధించిన చిత్రాన్ని ఛాట్‌జీపీటీ నుంచి తీసుకుని మరెక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేసిందని వివరించింది. ప్రతి సందర్బంలోనూ వినియోగదారుడు తమ సమాచారంతో శిక్షణ పొందేందుకు ఏఐ మోడల్‌ను అనుమతించారని తెలిపింది. అయినప్పటికీ డేటాను ఈ విధంగా వాడటం సరికాదని అంగీకరించింది. ఈ లోపాన్ని గుర్తించిన తరువాత తాము తగిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement