అంత్యక్రియలొద్దు, అస్థికలు యమునలో : అందుకే నిప్పంటించుకున్నా! | Delhi man posts last YouTube video note on WhatsApp before tragedy in house | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలొద్దు, అస్థికలు యమునలో : అందుకే నిప్పంటించుకున్నా!

Sep 19 2026 7:03 PM | Updated on Sep 19 2026 7:11 PM

Delhi man posts last YouTube video note on WhatsApp before tragedy in house

పశ్చిమ ఢిల్లీలోని 64 ఏళ్ల వ్యక్తి మరణించిన తీరు కలచి వేస్తోంది.   తొలుత ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో చనిపోయాడని భావించారు. కానీ మరణానికి ముందు ఆ వ్యక్తి వాట్సాప్‌లో సూసైడ్ నోట్‌, యూట్యూబ్‌లో వీడియోను కూడా అప్‌లోడ్ చేశాడు. ఇదే నా లాస్ట్‌ వీడియో అని చెప్పడం అందర్ని షాక్‌కు గురిచేసింది. 

ఓల్డ్ షాపురా ప్రాంతంలో సుమారు ఐదేళ్లుగా ఒంటరిగా అద్దెకు ఉంటున్నాడు విజయ్‌. శనివారం తెల్లవారు జామున 3.26 గంటలకు అగ్నిప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందింది. నాలుగు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు ఆరిపోయిన తర్వాత, ఇంటి లోపల తీవ్రంగా కాలిపోయిన మృతదేహం లభ్యమైంది.

ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా తేలిందని పోలీసులు వెల్లడించారు.  మరణానికి ముందు  విజయ్‌ వాట్సాప్‌లో ఒక సూసైడ్ నోట్  షేర్‌ చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.అలాగే యూ ట్యూబ్‌లో తన చివరి వీడియోను కూడాపోస్ట్‌ చేయడం కలకలం రేపింది అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. 

ఇదీ చదవండి : మొదటి భార్యతో రిలేషన్‌ : కొడుకు, ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది!
 

సుభాష్ నగర్ నివాసి అయిన ప్రకాష్ చౌహాన్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు  వాట్సాప్ సందేశంలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. అలాగే తాను స్వయంగా ప్రాణాలను తీసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని యూట్యూబ్‌లో ఒక వీడియోను కూడా అప్‌లోడ్ చేశాడు. విజయ్ తన కుమార్తె  గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆమెను  చాలా ప్రేమిస్తున్నానని, ఆమె లేని లోటు తీరనిదని చెప్పాడు. తన అంత్యక్రియల వల్ల తన కుటుంబం పడే వేదన నుండి తప్పించుకోవడానికే తాను నిప్పంటించుకుంటున్నానని చెప్పాడు. తన అస్థికలను తన కుమార్తె యమునా నదిలో నిమజ్జనం చేయాలని కూడా అతను ఆకాంక్షించాడు.

ఇదీ చదవండి: పూణె వ్యాపారి కిడ్నాప్‌ కేసు ట్విస్ట్ : మలేషియా ట్రిప్‌ అని చెప్పి!

విజయ్‌కు విడాకులు అయ్యాయని, అతను యూట్యూబ్‌లో వ్లాగ్‌లను రూపొందించి అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు తెలిపారు.  త్మహత్యగా ప్రాథమిక విచారణలో తేలిందని తదుపరి దర్యాప్తు కొనసాగుతందని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement