ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. | Telangana, 25 Workers Injured As RTC Bus Hits Tractor Trolley In Siddipet, Check Details Inside | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

Sep 19 2026 9:35 AM | Updated on Sep 19 2026 10:21 AM

Siddipet TSRTC Bus Hits Tractor Trolley 35 Injured

25 మంది కూలీలకు తీవ్రగాయాలు..

బస్సులో ఉన్న 10 మందికీ గాయాలు

ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరా 

తెలంగాణ: ట్రాక్టర్‌ ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. దీంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

బిహార్‌కు చెందిన కూలీలు తిమ్మారెడ్డిపల్లి శివారులోని కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. కుకునూరుపల్లిలో కూరగాయల మార్కెట్‌కు ట్రాక్టర్‌ ట్రాలీలో వెళ్తున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ ట్రాలీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ పలీ్టకొట్టింది. కూలీలు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ట్రాలీలో ఉన్న 25 మందిలో ఆరుగురికి తీవ్ర, 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరా తీశారు. కలెక్టర్, పోలీస్‌ కమిషనర్, డిపో మేనేజర్‌కు ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ సూచించారు.

ఇదీ చదవండి: తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement