కాంగ్రెస్‌ నేతలకు అన్నంపెట్టి భూములు చూపిస్తా.. హరీష్‌ రావు | Harish Rao says he will feed Congress leaders and show them the lands | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలకు అన్నంపెట్టి భూములు చూపిస్తా.. హరీష్‌ రావు

Sep 18 2026 2:25 PM | Updated on Sep 18 2026 2:52 PM

Harish Rao says he will feed Congress leaders and show them the lands

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ నేతలకు తానే దగ్గరుండి తన భూములు చూపిస్తానని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. వారందరికీ అన్నంపెట్టి మరి తన భూములు చూపిస్తానని అయితే వారు మాత్రం ఉన్నది ఉన్నట్లుగానే ప్రజలకు చెప్పాలని ఏమాత్రం అబద్ధాలు ప్రచారం చేయవద్దని స్పష్టంచేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని అందరికీ తెలుసని ఎన్నికల అఫిడవిట్‌లోనే తన ఆస్తుల వివరాలు అన్నీ ప్రజలకు చూపించాననని తెలిపారు. సిద్దిపేటలో ఈరోజు (శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ నేతలు సిద్ధిపేటకు వస్తే మూడు జిల్లాల నుండి 3వేల మంది పోలీసులు ఎందుకు సిద్ధిపేటకు వస్తున్నారు.పోలీసులు, బులెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల్లా తానేప్పుడూ  కబ్జాలు పెట్టలేదని అక్రమంగా దోచుకోలేదన్నారు. తన పనితీరు చూసే  పని తీరు చూసి  ఏడుసార్లు సిద్దిపేట ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని హరీశ్‌ రావు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: సిద్దిపేటకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement