బెంగళూరు: తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని కానని, తన మాటలను ఎవరు పాటిస్తున్నారో తెలియదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. గురువారం విధానసౌధలో పార్టీ ఆఫీసులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ నేతలు సుర్జేవాలా తదితరులతో విడిగా సమావేశమైన తరువాత సిద్దరామయ్య ఇలా చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ప్రభుత్వంలో తన మాట చాలా పరిమితమనే నిజాన్ని పరోక్షంగా బయటపెట్టారు.
ఈ సందర్భంగా సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా రాజ్యాంగ ప్రాథమిక ఆకాంక్షలు పూర్తిగా అమలు కాలేదన్నారు. సమాజంలో పాతుకుపోయిన కుల అసమానతలను నిర్మూలించడానికి శూద్ర, అణగారిన వర్గాలు మేల్కొని సంఘటిత పోరాటం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ఫాం హౌస్‌కు రెవెన్యూ అధికారులు.. అసలేం జరగనుంది?


