సాక్షి,సిద్దిపేట: ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా మరికాసేపట్లో రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌ను సందర్శించనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మర్కుక్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు సంబంధిత ఫైళ్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో సమావేశమై ఫాంహౌస్ భూములపై సమీక్ష నిర్వహించారు.
మరోవైపు, శుక్రవారం సిద్దిపేటలో కాంగ్రెస్ ఎంపీలు పర్యటించనున్నారు. కబ్జా ఆరోపణలున్న భూమలను వారు పరిశీలించడంతో పాటు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


