‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’ | Minister Ponguleti Srinivasa Reddy Counters To KTR | Sakshi
Sakshi News home page

‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’

Sep 17 2026 2:46 PM | Updated on Sep 17 2026 3:25 PM

Minister Ponguleti Srinivasa Reddy Counters To KTR

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అఫిడవిట్లలో భూముల వివరాలపై కేటీఆర్‌ను నిలదీసిన పొంగులేటి.. కేసీఆర్ ఆస్తులపై ప్రశ్నిస్తే.. కేటీఆర్‌కు ఎందుకంత ఉలికిపాటు?. 2004 అఫిడవిట్‌లో భూములు లేవు.. ఇప్పుడు వందల ఎకరాలు ఎలా?. అఫిడవిట్లలో నిజాలు రాశారా? ప్రజలను మోసం చేశారా?. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించిన పొంగులేటి.. అఫిడవిట్లలో ఒకటి.. మాటల్లో మరొకటా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కుటుంబానిదే. భూముల పెరుగుదలపై లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు? కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

‘‘అఫిడవిట్లలో పేర్కొన్న భూముల వివరాలను ప్రజల ముందు పెట్టాలి. కేటీఆర్ మాటలకు.. ఎన్నికల అఫిడవిట్లకు పొంతన ఉందా?. భూ ఆరోపణలపై కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధమా?. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలా?’’ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

ఇదీ చదవండి: పొరపాట్లు జరిగాయి.. పరిష్కరిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement