TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ | Schedule for the TG Graduate MLC elections voter enrollment released | Sakshi
Sakshi News home page

TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ

Sep 17 2026 4:02 PM | Updated on Sep 17 2026 4:24 PM

Schedule for the TG Graduate MLC elections voter enrollment released

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ అయ్యింది. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. వచ్చే మార్చి 2027తో ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సరికొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనుంది రాష్ట్ర ఈసీ.

దీనిలో భాగంగా నవంబర్‌ 1 తేదీ నాటికి డిగ్రీ పూర్తి మూడేళ్లు పూర్తయిన వారందరూ అర్హులు, అయితే గతంలో ఓటు నమోదు చేసుకున్న పాత ఓటర్లు సైతం తప్పనిసరిగా కొత్తగా ఫారం-18ని ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంల నుంచి ఆయా సభ్యుల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కానుంది. 

ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు.. 

  • సెప్టెంబర్ 28న ఓటర్ల నమోదు ప్రక్రియకు నోటిఫికేషన్

  • నవంబర్ 1, 2026 అర్హత తేదీగా ఓటర్ల జాబితా తయారీ

  • నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ

  • నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

  • నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ

  • డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు తెలంగాణ  సీఈఓ కీలక సూచనలు

  • ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేరున్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి 

  • ఫారం-18తో పాటు ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలు సమర్పించాలి

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో అవకాశం

  • ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, డిజిగ్నేటెడ్ అధికారుల వద్ద ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు

  • పోస్టు ద్వారా ఫారం-18 దరఖాస్తుల సమర్పణకు అవకాశం

ఇదీ చదవండి: ‘లెక్కలు చెప్పకుండా ఎదురుదాడి ఎందుకు?’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement