జస్ట్‌ రూ. 100తో మొదలై..రూ. 2 కోట్ల వ్యాపార సామ్రాజ్యం! | Success Story: Elavarasi Jayakanth built Rs 2 crore Aswathy Chips Stall | Sakshi
Sakshi News home page

జస్ట్‌ రూ. 100తో మొదలై..రూ. 2 కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

Sep 17 2026 4:06 PM | Updated on Sep 17 2026 4:28 PM

Success Story: Elavarasi Jayakanth built Rs 2 crore Aswathy Chips Stall

ఏ వ్యాపారంలోనైనా ఒక్కసారి ఘోరమైన నష్టం చవిచూస్తే..మళ్లీ దానివైపుకి కన్నెత్తి చూసే సాహసం చేయం. అసలు ఆ కష్టం నుంచి కోలుకోవడమే చాలా కష్టం. కానీ ఈ మహిళ వ్యాపారంలో ఎంత ఘోరమైన నష్టాలు చూసిందంటే..చేతిలో వంద రూపాయలతో రోడ్డుపైకి వచ్చేసింది. కానీ ఆ వంద కంటే తక్కువ మొత్తంతోనే మళ్లీ వ్యాపారం ప్రారంభించి.. ఇవాళ ఏ రేంజ్‌కి చేరుకుందో తెలిస్తే విస్తుపోతారు. నష్టాలనేవి నట్టేట ముంచేవి కాదు..నింగికేగేసేలా చేసే పాఠాలని చెబుతోంది ఆమె సక్సెస్‌ స్టోరీ.  

ఆ శక్తిమంతమైన మహిళే ఇలావరసి జయకాంత్‌. తమిళనాడులోని ఉసిలంపట్టికి చెందిన ఆమె కుటుంబం కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు వలస వచ్చింది. ఆమె తల్లిదండ్రులు జీవనోపాధి కోసం స్వీట్స్‌, స్నాక్స్‌ తయారు చేసి విక్రయిస్తుండేవారు. అలా ఆమెకు చిన్ననాటి నుంచి ఉత్పత్తులను చుట్టపక్కల వాళ్లకు అమ్మడంలో పేరెంట్స్‌ సహాయం చేస్తుండేది. పెళ్లి తర్వాత కూడా జయకాంత్‌ తన కుటుంబ సంప్రదాయన్ని కొనసాగిస్తూ.. ఆమె కూడా ఇంట్లోనే స్వీట్లు, స్నాక్స్‌ తయారు చేసి, సమీపంలో ఇళ్లలో ఉత్పత్తులనను అమ్ముతుండేది. 

దీనికి చుట్టపక్కల వాళ్లు, బంధువుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పెద్ద వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకుంది. అలా తన వద్ద ఉన్న పొదుపు, బ్యాంకు రుణాలు, కొంత బయట నుంచి తెచ్చిన అప్పుతో సహా మొత్తం రూ. 50 లక్షలతో సూపర్‌మార్కెట్‌ను ప్రారంభించింది. దాంట్లోనే పండ్లు, కూరగాయలతో చేసిన హల్వా, చిప్స్‌, కేకులు, స్వీట్లు, స్నాక్స్‌ వంటి వస్తువులను విక్రయించడం ప్రారంభించింది. అంతేగాదు 50 మందిదాక ఉపాధి కల్పించింది. 

సరిగ్గా 2011లో సూపర్‌ మార్కెట్‌ దొంగతనానికి గురవ్వడంతో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంది. ఎంతలా అంటే వ్యాపారంలో మొత్తం డబ్బునిపోగొట్టుకుని చేతిలో కేవలం వంద రూపాలయతో రోడ్డు మీదకు వచ్చేసింది. ఆ నష్టం ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఆస్పత్రి పాలు చేసింది. కానీ ఆమెకు విరామం తీసుకునే వ్యవధి లేనంతగా బ్యాంకు నుంచి అప్పులవాళ్ల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఆమె వెంటనే మళ్లీ.. మరో వ్యాపారం చేసి నిలదొక్కుకుంటే పరిస్థతి చక్కబడేలే లేదని గ్రహించి చివరకు చేతిలో ఉన్న కొద్ది మొత్తంతోనే  త్రిస్సూర్ రైల్వే స్టేషన్ సమీపంలో 'అశ్వతి హాట్ చిప్స్' అనే ఒక చిన్న హాట్-చిప్స్ స్టాల్‌ను ప్రారంభించింది. 

వంద రూపాయల కన్నా తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారం కాస్తా అమ్మకాలు ఊపందుకుని తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అలా చిప్స్‌ తోపాటు వడలు వంటి వాటిని జోడించి వ్యాపారాన్ని విస్తరించింది. అలా తొలి వ్యాపారంలో ఎదురైన అప్పులన్నిటినీ తీర్చేసింది. అంతేగాదు ఆ చిన్న స్టాల్‌లోనే ఏకంగా కేకులు, స్వీట్లు, ఊరగాయలు కూడా చేర్చింది. 

అలా కొద్దికాలంలోనే  ఆ వ్యాపారం ఇలావరసి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా నమోదై అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఇవాళ ఏకంగా రెండు కోట్లు టర్నోవర్‌ చేసే వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అలాగే ఈమె కథ పెద్ధ పెట్టుబడులతోనే విజయం రాదని, కష్టించేతత్వం ఉంటే చిన్న మొత్తంతో ఊహకందని సక్సెస్‌ని ఒడిసిపట్టుకోవచ్చని నిరూపిస్తోంది కదూ..

(చదవండి: సాధారణ ఫుడ్‌ డెలివరీ కాస్తా..ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లేలా..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement