గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్(Oracle)లో ఉద్యోగాల కోత ప్రకంపనలు రేపుతున్న వేళ, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సక్సెస్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. లక్షల జీతం వదులుకొని ఫలూదా బిజినెస్ మొదలు పెట్టి రూ. 9 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండటం విశేషంగా నిలుస్తోంది. తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
2019లో ప్రదీప్ కన్నన్ (Pradeep Kannan) నెలకు లక్ష రూపాయలు ఆర్జిస్తున్న సమయంలో తన స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. తనకంటూ ఒక సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఆయన ప్రణాళిక. ఈ మాట వినగానే లక్షల జీతం వదులుకొని ఐస్ క్రీం షాపులేంటి?అని అందరూ ఎగతాళి చేశారట. కానీ కల సాకారం కోసం 33 ఏళ్ల వయసులో బెంగళూరు వదిలి తన సొంత ఊరు కరూర్ (తమిళనాడు) వెళ్ళి 'ది ఫలూదా షాప్' (The Falooda Shop) ప్రారంభించారు.
నిజానికి ఒరాకిల్‌కు ముందే ఆయన 'లెట్స్ కుల్ఫీ' (Lets Kulfi) పేరిట ఒక కుల్ఫీ వ్యాపారాన్ని ప్రారంభించి విఫలమయ్యారు. అయితే ఆ వైఫల్యం ద్వారా వ్యాపార మెళకువలు, కస్టమర్ల అభిరుచులు , నిర్వహణలో ఉండే సవాళ్లను బాగా అర్థం చేసుకున్నారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అడుగు ముందుకేశారు. కేవలం రూ. 6 లక్షల పొదుపు , కుటుంబ ఆస్తులతో కరూర్‌లో 10x10 అడుగుల చిన్న కియోస్క్‌తో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతే ఒక వెనుదిరిగి చూసింది లేదు. కాలక్రమేణా వ్యాపారం దేశవ్యాప్తంగా విస్తరించింది. దుబాయ్‌లో కలిపి 20కి పైగా అవుట్‌లెట్‌లతో ప్రముఖ డెజర్ట్ బ్రాండ్‌గా అవతరించింది. వివిధ నివేదికల ప్రకారం ఈ వ్యాపార విలువ సుమారు రూ. 9 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
ఉత్పత్తుల్లో నాణ్యత, రుచి ఎక్కడా మారకుండా ప్రామాణిక పద్ధతులను అనుసరిస్తూ ఎన్నోజాగ్రత్తలు పాటించారు. కస్టమర్లే స్వయంగా ఫ్రాంచైజీల కోసం ముందుకు రావడంతో ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. ప్రస్తుతం సాంప్రదాయ ఫలూదాతో పాటు, డబ్బాలో లభించే (ready-to-eat) క్యాన్ ఫలూదాలను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చారు.
ఇదీ చదవండి:


