గణేశ్‌ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్‌.. అంత ఖరీదా ఆ చీర! | Sara Tendulkar chose a Ritu Kumar saree worth More Than Rs 2 lakh | Sakshi
Sakshi News home page

Sara Tendulkar: గణేశ్‌ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్‌.. అంత ఖరీదా ఆ చీర!

Sep 16 2026 1:21 PM | Updated on Sep 16 2026 2:20 PM

Sara Tendulkar chose a Ritu Kumar saree worth More Than Rs 2 lakh

గణేశ్‌ చతుర్థి సమయంలో మహారాష్ట్ర అంతా కళకళలాడుతుంటుంది. అలాగే సెలబ్రిటీలు తమ గ్లామరస్‌ లుక్‌తో ఆధ్యాతికతకు సరికొత్త శోభను చేకూరుస్తూ సంప్రదాయాబద్ధంగా కనిపించడం విశేషం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌ సైతం ఈ వేడుకలో దేవతలా ముగ్ధమనోహరంగా కనిపించింది. 

అందరి చూపులా ఆమె మీదనే అనేంతంగా కట్టిపడేసింది తన అందమైన లుక్‌తో. ఈ న్యూట్రిషనిస్ట్‌ సార్‌ ఈ పండుగ కోసం టిఫనీ బ్లూ రంగు చీరను ఎంచుకుంది. దానిపై అంతటా మోటిఫ్‌లు అలకరించిన క్లిష్టమైన జరీ వర్క్‌ ఉంది. ఎమరాల్డ్‌ సత్నామ్‌ చీర ఇది. సిల్క్‌ శాటిన్‌ వస్త్రం. రితుకుమార్‌ డిజైన్‌ చేసిన చీరను ఎంపిక చేసుకుంది సారా. దీనికి అనుగుణంగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ని జత చేసిందామె. తన చీరకు సరిపోయేలా స్టడెడ్‌ నెక్లెస్‌ , చెవిపోగులు, చేతులకు నిండుగా కనిపించేలా గాజులు తదితరాలను ధరించి మహారాణిలా హోయలు ఒలికించింది. 

 

ఆకర్షణీయంగా కనిపించేలా అలలు అలలుగా కురులను వదిలేసి,  తెల్లని పువ్వులతో చేసిన గజ్రాను ధరించింది. ఇక తేలికైన మేకప్‌తో ఆమె మరింత అందంగా కనిపించేలా ఏకా లఖానీ తీర్చిదిద్దారు. మరి సారా ధరించిన ఆ అందమైన చీర ధర తెలిస్తే కంగుతినాల్సిందే. అక్షరాల రూ.2.1 లక్షలపైనే ఉంటుందట. 

అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేస్తూ..గణేశ్‌ సీజన్‌ అని క్యాప్షన్‌ జోడించింది. అలాగే గణేశ్‌పూజ చేసుకున్న వీడియోని, తన కుటుంబ సభ్యలతో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి మరి..!.

 

ఇదీ చదివండి:  అందాల పోటీ ముగిశాక ఆ బ్యూటీల జీవితం ఎలా ఉంటుందో తెలుసా..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement