వినాయక నవరాత్రులను అంతా ఆస్వాదిస్తున్నారు కదా..? వినాయక చవితి రోజు వ్రతకథలో శివుడు వినాయకుడి తలను తన త్రిశూలంతో ఖండించడం.. ఆ తర్వాత ఏనుగు తలను పెట్టడం.. అందుకే గణపతి గజముఖుడిగా మనకు కనిపించడం తెలిసిందే..! అయితే.. శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడ ఉందో తెలుసా..? భూగర్భంలో 90 అడుగుల లోతులో ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి రావడమంటే.. ప్రాణాలకు తెగించడమే..!
అది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న గంగోలిహాట్. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం వెళ్తే.. మీరు భువనేశ్వర్ అనే చిన్న గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడే ఉంది.. ఈ భూగోళంలోనే అత్యంత రహస్యమైన ‘పాతాల్ భువనేశ్వర్’ గుహ..! అది సముద్రమట్టానికి 1,930 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే ఇదంతా కేవలం నమ్మకమేనా..? సైన్స్ ఏం చెబుతోంది..? ఇంకా పాతాళ్ భువనేశ్వర్ గుహ గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి..


