breaking news
ganesh charturdi
-
మహా గణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)
-
శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడుందో తెలుసా?
వినాయక నవరాత్రులను అంతా ఆస్వాదిస్తున్నారు కదా..? వినాయక చవితి రోజు వ్రతకథలో శివుడు వినాయకుడి తలను తన త్రిశూలంతో ఖండించడం.. ఆ తర్వాత ఏనుగు తలను పెట్టడం.. అందుకే గణపతి గజముఖుడిగా మనకు కనిపించడం తెలిసిందే..! అయితే.. శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడ ఉందో తెలుసా..? భూగర్భంలో 90 అడుగుల లోతులో ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి రావడమంటే.. ప్రాణాలకు తెగించడమే..!అది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న గంగోలిహాట్. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం వెళ్తే.. మీరు భువనేశ్వర్ అనే చిన్న గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడే ఉంది.. ఈ భూగోళంలోనే అత్యంత రహస్యమైన ‘పాతాల్ భువనేశ్వర్’ గుహ..! అది సముద్రమట్టానికి 1,930 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే ఇదంతా కేవలం నమ్మకమేనా..? సైన్స్ ఏం చెబుతోంది..? ఇంకా పాతాళ్ భువనేశ్వర్ గుహ గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
ఆకర్షిస్తున్న ‘గోల్డెన్ మోదక్’.. కిలో ఎంతంటే..
నాసిక్: వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ షాప్ ప్రత్యేకమైన మోదక్‌ను తయారు చేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విద్యా వికాస్ సర్కిల్లోని సాగర్ స్వీట్స్ 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో ‘గోల్డెన్ మోదక్’ను తయారు చేసింది. కిలో ధరను ఏకంగా రూ.27,000గా నిర్ణయించింది. దీంతో ఈ మోదక్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వినాయక చవితిని పురస్కరించుకుని సాగర్ స్వీట్స్ 25కు పైగా రకాల మోదక్‌లను అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ రకాలతో పాటు ప్రీమియం స్వీట్లు ఇందులో ఉన్నాయి. అయితే 24 క్యారెట్ల బంగారు పూతతో రూపొందించిన మోదక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.వినాయక చవితి వేడుకల్లో మోదక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది గణేశుడికి ఇష్టమైన పదార్థంగా భావిస్తారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు కొబ్బరి కోరు తదితర పదార్థాలతో నింపిన మోదక్‌లు, చాక్లెట్ మోదక్‌లు తదితర రకాలను తయారు చేసి గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సంప్రదాయ మోదక్‌లు వేడుకల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా స్వీట్ షాపులు కొత్త రకాల మోదక్‌లను పరిచయం చేస్తున్నాయి.వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ భక్తులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో, మండపాల్లో మట్టి గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రతిరోజూ ప్రార్థనలు, నైవేద్యాలు, హారతులు నిర్వహిస్తారు. చివరగా గణేశ నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి.ఇదీ చదవండి: గణేశ్ మండపంలో దారుణ హత్య -
అంబానీ ఇంట గణపతి పూజ.. సినీ తారల సందడి
అంబానీ ఇంట గణపతి పూజోత్సవరం అంగరంగ వైభవంగా జరిగింది. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తారలు మెరిసిపోవడంతో వేడుకకకు మరింత కళ వచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా సెటబ్రిటీల లక్స్, వారి సందడి నెటిజన్లును ఆకట్టుకుంటున్నాయి. మరి ఎవరెవరు హాజరయ్యారో ఒకసారి చూద్దాం రండి. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) -
పులివెందులలో కాల్పుల కలకలం
సాక్షి,వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. టీడీపీ నేతలు పుష్పనాథ్‌రెడ్డి, విజయ్‌రెడ్డిల మధ్య స్థానిక వివాదం కారణంగా వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో విజయ్‌రెడ్డి, పుష్పనాథ్రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువర్గాలూ పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద నిలిపి ఉంచిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. అయితే ఆయన అక్కడకు వెళ్లిన సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారడంతో, ఆయన గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అత్యంత సంపన్న గణపతి మండపం.. రూ.703 కోట్ల బీమా
ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ప్రతిష్ఠించిన జీఎస్బీ మహాగణపతి విగ్రహానికి ఈ ఏడాది రూ.703.27 కోట్ల బీమా కల్పించారు. దేశంలోనే అత్యంత సంపన్న గణపతి మండపాల్లో ఒకటిగా పేరున్న జీఎస్బీ సేవా మండల్ ఈ బీమా తీసుకుంది. గత ఏడాది రూ.474 కోట్ల బీమా తీసుకోగా.. ఈ ఏడాది మొత్తం పెరిగింది.ఈ మహాగణపతి విగ్రహాన్ని 66 కిలోలకు పైగా బంగారం, 335 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. విలువైన రత్నాలను కూడా విగ్రహానికి అలంకరించారు. ఈ ఆభరణాల్లో చాలా వరకు భక్తులు, సేవకులు విరాళంగా ఇచ్చినవేనని నిర్వాహకులు తెలిపారు.జీఎస్బీ అంటే గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్. ఈ మండల్ ఈ ఏడాది 72వ గణేశోత్సవాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు 5 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మహాగణపతి విగ్రహాన్ని పర్యావరణహితంగా తయారు చేశారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ 40,000 మందికి పైగా అన్నదాన సేవ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల వ్యవధిలో 2 లక్షల మందికి పైగా ప్రసాదం అందుకోనున్నట్లు చెప్పారు.వేద సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం పలు పూజలు, సేవలు నిర్వహించనున్నారు. కాగితపు వృథాను తగ్గించేందుకు సంప్రదాయ ముద్రిత రశీదుల స్థానంలో డిజిటల్ రశీదులను కూడా ప్రవేశపెట్టారు. -
ఈ కాలానికి తగ్గ దేవుడు
మొన్న ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల పొడుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకుపోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే. ఎపిక్టెటస్! ‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు. ‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్ ఎక్కడ? ఈ పాత బోయిన్పల్లి ఎక్కడ?’ అన్నాను. ‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. ‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద పాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని. కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్‌ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అ΄లొజిటిక్గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగిపోయింది?’ అనడిగాడు.‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగి΄ోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను. ‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో. ‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చెప్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చెప్పొచ్చు. ఎలక చూడు. ఎంత రెస్ట్‌లెస్‌గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూపోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసి΄ోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్.వాడ్రేవు చిన వీరభద్రుడు చదవండి: ఘనమైన ఆసనం -
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. ఏటా ఖరీఫ్ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి. ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా మొర నువ్వైనా వింటావా.. గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ. ఇట్లు.. గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు -
వినాయక చవితి: వాహనాల మళ్లింపులు, ట్రాఫిక్ మార్గదర్శకాలు ఇవే..
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు పోలీసు అధికారులు శనివారం అన్ని ప్రధాన రహదారులను, రూట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి.జోయల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ అవినాశ్ కుమార్, అడిషనల్ డీసీపీ శ్రీరాములు, ఏసీపీ ట్రాఫిక్ ఎస్.మోహన్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.అనంతరం జోయల్ డెవిస్ మీడియా సమావేశంలో మాట్లాడి.. బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులు, వాహనదారులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ట్రాఫిక్ బందోబస్తు, మార్గదర్శకాలను వివరించారు.ముఖ్యమైన అంశాలు ట్రాఫిక్ మార్గదర్శకాలు:దర్శన దారులు (4 ప్రధాన మార్గాలు):1. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వైపు నుంచి.2. ద్వారకా హోటల్ / టెలిఫోన్ భవన్ వైపు నుంచి.3. మింట్ కాంపౌండ్ / ఐమాక్స్ ప్రసాద్ వైపు నుంచి.4. గణేశుడి విగ్రహం వెనుక ఉన్న బస్తీ వైపు నుంచి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: ఉత్సవాలు జరిగే రోజుల్లో దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రద్దీని నివారించేందుకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి. మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఖైరతాబాద్ మార్గంలో రోజువారీ 2,200 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతోంది. రద్దీ సమయాలు, సూచనలు: మధ్యాహ్నం తర్వాత, వారాంతాల్లో (శని, ఆదివారాలు), సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచే దర్శనం ప్రారంభమవుతుంది కాబట్టి, సాయంత్రం రద్దీని నివారించడానికి భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే దర్శనం పూర్తి చేసుకోవాలి. కుదిరితే సోమవారం నుంచి శుక్రవారం మధ్య రోజులలో దర్శనానికి రావడం ఉత్తమం. సొంత వాహనాలు & కార్ పూలింగ్: వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు కార్ పూలింగ్ (ఒకే కారులో కుటుంబ సభ్యులు, మిత్రులు కలసి రావడం) పాటించాలి. కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ మార్గ్ / ఐమాక్స్ వైపు: ఐమాక్స్ గ్రౌండ్, హెచ్ఎమ్డీఏ లేక్ వ్యూ పార్కింగ్, ఎన్టీఆర్ పార్క్ వెనుక భాగంలోని ఈ-రేసింగ్ (E-Racing) గ్రౌండ్. నెక్లెస్ రోడ్ వైపు: పైన పేర్కొన్నవి నిండితే నెక్లెస్ రోడ్డులోని మక్తా పార్కింగ్ స్థలం. మెట్రో / వివి స్టాచ్యూ వైపు: విశ్వేశ్వరయ్య భవన్ (ఇక్కడ దిగిన వారు రోడ్డు దాటాల్సి ఉంటుంది). టెలిఫోన్ భవన్ వైపు: పరిమిత పార్కింగ్ మాత్రమే కలదు. (భక్తులు వీలైనంత వరకు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న పార్కింగ్ స్థలాలనే ఉపయోగించుకోవాలి). ఆటోలు, ఓలా, ఊబర్ (పికప్ / డ్రాపింగ్ పాయింట్స్): వీవీ స్టాచ్యూ నుంచి నిరంకారీ మధ్య ప్రధాన రహదారిపై ఎక్కడం/దిగడం వల్ల ట్రాఫిక్ స్తంభిస్తుంది. అందువల్ల ఆటోలు, క్యాబ్‌ల డ్రాపింగ్, పికప్‌లను ఎంఎంటీఎస్ (MMTS) స్టేషన్ పక్కన ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లోనే చేసుకోవాలి. మెట్రో ప్రయాణికులకు ప్రత్యేక సూచన మెట్రోలో వచ్చే భక్తులు దిగిన తర్వాత ఖైరతాబాద్ బడా గణేశ్ ఉన్న వైపే (గణేశ్ పండల్ వైపు) నిష్క్రమించాలి. పొరపాటున 'సెవెన్ టెంపుల్స్' వైపు దిగితే రోడ్డు దాటాల్సి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. భక్తుల సౌకర్యార్థం అక్కడ సైనేజ్ బోర్డులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాహనాల మళ్లింపు (Traffic Diversions): సాధారణ భక్తుల వాహనాలకు రాజ్‌దూత్ లేన్, ద్వారకా హోటల్ వైపు నుంచి లోపలికి అనుమతి ఉండదు. వాటిని టెలిఫోన్ భవన్ వైపు మళ్లిస్తారు. మింట్ లేన్ లోపలికి వాహనాలను అనుమతించరు. వాటిని సెక్రటరియేట్ వైపు మళ్లిస్తారు. ఐమాక్స్ థియేటర్ దాటి బడా గణేశ్ వైపు అనుమతి లేదు. డైరెక్ట్‌గా నెక్లెస్ రోడ్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి రైల్వే క్రాసింగ్ దాటి అనుమతి ఉండదు. డైరెక్ట్‌గా నిరంకారీ వైపు మళ్లిస్తారు. పాదచారుల క్యూ లైన్లు & బారికేడింగ్: కాలినడకన వచ్చే భక్తుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాహనాలు వెళ్లే క్యారేజ్‌వే పైకి పాదచారులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్ అండ్ బీ (R&B) ఆధ్వర్యంలో మెష్ బారికేడింగ్ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ యూటర్న్, నిరంకారీ వద్ద మాత్రమే రోడ్డు దాటేందుకు (Pedestrian Crossing) అనుమతి ఉంటుంది. బందోబస్తు & భద్రత: ఐఆర్ సిబ్బంది, పుషింగ్ టీమ్స్‌తో పాటు దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందిని ప్రధాన జంక్షన్లు (వీవీ స్టాచ్యూ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, షాదాన్, నిరంకారీ, ద్వారకా హోటల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి జంక్షన్, సెక్రటరియేట్, ఎన్టీఆర్ మార్గ్ మొదలైన చోక్ పాయింట్ల వద్ద) బందోబస్తులో డిప్లాయ్ చేస్తున్నారు. ముఖ్య గమనిక (దర్శనం ముగింపు తేదీ): సెప్టెంబర్ 23వ తేదీతోనే బడా గణేశ్ దర్శనం పూర్తవుతుంది. 24వ తేదీన దర్శనానికి ఎలాంటి అనుమతి ఉండదు. -
‘‘గణేశ వేడుకలకు ఎక్కడాలేని విధంగా ఈ సౌకర్యం అందిస్తున్నాం’’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శనివారం వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల సమీక్షలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని అన్నారు.‘‘మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఊహించని పరిణామాలు జరగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుంది. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. -
విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!
ఇటీవలే ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బాటలో విజయ్ దేవరకొండ చేరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆయనకు ఇచ్చిన విత్తన గణపతిని ఆయనకు అందజేసింది. ఈ మేరకు ఈ వినాయక చవితిని పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. ‘నగరం కలుషితం కాకుండా మట్టి లేదా విత్తన గణపతిని పూజిద్దాం. దీంతో మొక్కలు పెరుగుతాయి’ అని విజయ్ సూచించారు. మొక్కగా ఎదుగుతాయి..‘కెమెకిల్స్తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను గతంలో మెగాస్టార్ చిరంజీవి వివరించారు. Actor Vijay Deverakonda received a Seed Ganesha (Vittana Ganapati) from Green India Challenge team and appealed to all to celebrate Ganesh Chaturthi with eco-friendly Matti Ganapati and Vittana Ganapati.“Use safe clay and seed idols so we don’t pollute our city. After the… pic.twitter.com/NBHq2unlkK— Milagro Movies (@MilagroMovies) September 10, 2026 -
గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా..
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మరో వినూత్న కార్యక్రమం ముందడుగు పడింది. ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు.(ఎక్కువ మంది చదవింది: ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్’పై స్టార్‌హీరోల ప్రశంసలు)భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకెమెకిల్స్తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను చిరంజీవి వివరించారు.చిరంజీవికి కృతజ్ఞతలు‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను అభినందిస్తూ, ‘సీడ్ గణేశ’ కార్యక్రమానికి మద్దతు తెలిపిన చిరంజీవికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రోత్సాహకరమైన మాటలు మరింత మందిని పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకల వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులు పొందుతూనే.. ప్రకృతి పరిరక్షణను మన బాధ్యతగా గుర్తించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ‘గణేశుడిని పూజిద్దాం.. మొక్కను పెంచుదాం.. ప్రకృతిని కాపాడుదాం’ అనే సందేశంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.This Ganesh Chaturthi, I am happy to have Megastar Chiranjeevi garu unveil and launch the #SeedGanesha campaign. 🙏Seed Ganesha is a small effort to bring together devotion and care for nature. Made with natural materials and seeds, the idol can be immersed at home after the… pic.twitter.com/iFcpX8D6En— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2026ఇదీ చదవండి: ‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’ -
భుక్తికి లేకున్నా.. భక్తిలో మిన్న
కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్బీనగర్ మాతంగి కాంప్లెక్స్ ఎదుట రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లను పైకప్పుగా వేసుకున్న చిన్న గుడిసెలు కనిపిస్తాయి. మట్టి నేలలు, మూటలు, చీపుర్లు, గిన్నెలతో నిండిన చిన్నగదులే అక్కడివారికి నివాసాలు. తాము కడు బీదలమైనా.. మనసు ఎంత గొప్పదో ఓ గుడిసెలోని తొమ్మిదో తరగతి విద్యార్థి చరణ్ నిరూపించాడు. తమ గుడిసెల ముందు గణపతి విగ్రహం ప్రతిష్టించి నవరాత్రులు పూజించాలని భావించాడు. కానీ కూలిపని చేసుకునే తల్లిదండ్రులకు స్తోమత లేదు. అయినా, ఆ బాలుడు వెనకడుగు వేయలేదు. పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడల్లా ఓ దుకాణంలో పనిచేసి కొంతడబ్బు కూడగట్టుకున్నాడు. ఇందులోంచి రూ.1,500 వెచ్చించి వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఇంటి ఎదుట తడకలతో మండపం నిర్మించాడు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అర్చకుడిగా అవతారం ఎత్తాడు. తొమ్మిది రాత్రులపాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశాడు. భగవంతుడు విగ్రహంలో కాదు.. భావంలో ఉంటాడు. భక్తికి సామర్థ్యం అవసరం లేదు.. హృదయం చాలు.. అని చరణ్ నిరూపించాడు. నవరాత్రులకు తగ్గ ఏర్పాట్లు, అలంకరణలు చేసే స్తోమత లేకపోయినా.. ఆ బాలుడి భక్తి ముందు అవన్నీ దిగదుడుపే అయ్యాయి. తొమ్మిదిరోజుల పాటు రోజూ పూజలు చేసి, నైవేద్యం సమర్పించాడు. నిత్యం భక్తిపాటలతో అర్చించాడు. చివరకు శుక్రవారం శోభాయత్ర ఘనంగా నిర్వహించాడు. సమీపంలోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశాడు. ఈ సందర్భంగా పులిహోర, మిఠాయిలు కూడా గుడిసెలోనే తయారు చేసి అందరికీ పంచిపెట్టాడు. ఇది చూసిన ప్రతీఒక్కరూ కదిలిపోయారు. ఇది డబ్బుతో చేసేది కాదు.. మనసుతో చేసిన పూజ.. ఈ దృశ్యం మానవాళికి, సమాజానికి ఒక శిక్షణ.. ఈ బాలుడు చూపించిన భక్తి, ధనసామర్థ్యానికి మించిన ఆధ్యాతి్మక సంపదని ప్రశంసలు కురిపించారు. -
Ganesh Chaturthi: మునిగిన విగ్రహాలకు ఫొటోలు తీయడంపై నిషేధం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు ఆరున భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలున్న తరుణంలో ముంబై పోలీసులు పలు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం తర్వాత పాక్షికంగా కరిగిన గణపతి విగ్రహాలకు ఫోటోలు తీయడం, ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వు సెప్టెంబర్ ఏడు వరకు గ్రేటర్ ముంబై అంతటా అమలులో ఉంటుందని తెలిపారు.గణపతి నిమజ్జనం అనంతరం నీటి అలలకు సగం కరిగిన విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇవి పలువురి మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. గతంలో ఇటువంటి విగ్రహాలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్మికులు తిరిగి నిమజ్జనం చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఫొటోలు, వీడియోలు మతపరమైన భావాలను దెబ్బతీస్తాయని, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) అక్బర్ పఠాన్ మాట్లాడుతూ నిమజ్జనం తర్వాత తేలియాడే లేదా సగం మునిగిపోయిన విగ్రహాల ఫోటోలు తీయడం, వాటిని ఏ రూపంలోనైనా ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరం అంతటా దీని గురించి ప్రచారం చేయాలని అధికారులను ఆయన కోరారు. -
భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ గణేష్ చతుర్థి (ఆగస్టు 27న)ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంట అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దురంధర్ నటుడు రణవీర్ న్యూలుక్ వైరల్‌గా మారింది. పాప పుట్టిన తరువాత పబ్లిక్ అప్పియరన్స్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పల్లవ్ పల్లీవాల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న వీరి వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.గోల్డ్ అండ్‌గ్రీన్ దుస్తుల్లో దీపికా ,రణ్వీర్ సింగ్ మెరిసారు. ముఖ్యంగా ధురంధర్ షూటింగ్ ప్రారంభించిన నెలల తర్వాత వచ్చిన క్లీన్-షేవ్ లుక్ నెటిజన్లు ఆకర్షిస్తోంది. పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి కనిపించాడు. ఈ దంపతులు ముంబైలోని వరసిద్ధి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. గర్భంతో ఉన్నపుడు దీపికా ఈ గణపతిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.దీపికా పదుకొనే- రణ్వీర్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం దువాకు జన్మనిచ్చారు. దువాకు మరికొన్ని రోజుల్లో సంవత్సరం నిండనుంది. తమ కుమార్తెను ప్రజల దృష్టి నుండిదూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఫోటోలను తీయవద్దని కూడా అభ్యర్థించారు కూడా. మరి దువా ఫస్ట్ బర్త్‌డే వేడుకలు ఘనంగా ఉండబోతున్నాయా?ఈ సందర్భంగా నైనా పాపను చూపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉందైంది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)కాగా రణ్వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్ సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ఇటీవల డిజిటల్‌గా లాంచ్ అయిన 2 నిమిషాల 42-సెకన్ల కట్, రేపు సినిమాల్లో విడుదలయ్యే పరమ సుందరికి జతచేయబడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. -
వినాయక చవితి పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేషుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: వినాయక చవితి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్‌లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్‌లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్‌కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్‌కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
లంబోదరుడి సేవలో బిగ్ బాస్ బ్యూటీ అరియానా (ఫొటోలు)
-
HYD: రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్‌లో బడా గణేష్‌తో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు.సెప్టెంబర్ 7నుంచి 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.ఖైరతాబాద్ వినాయక విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించలేదు.పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్‌దూత్ లేన్‌లోకి అనుమతించరు.ఇక్బాల్ మినార్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమంతించరు.ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/నెక్లెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ అనుమతించరు.నెక్లెస్ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు.నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేయాలని పోలీసులు కోరారు. -
చోటు.. నీకు సెల్యూట్!
రహమత్‌నగర్(హైదరాబాద్): ఓ ముస్లిం యువకుడు తొమ్మిదేళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు. కార్మికనగర్‌కు చెందిన షేక్ చోటు స్థానికంగా స్టార్ కేబుల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆటోస్టాండ్ వద్ద ఏటా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. గణనాథుడిని ప్రతిష్టించినప్పటి నుంచి నిమజ్జనం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఈ క్రమంలోనే మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని గురువారం రాత్రి మండపం వద్ద నిమజ్జనం చేశాడు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రతి సంవత్సరం కొత్త వినాయక విగ్రహాన్ని పెట్టడం వెనుక కారణమేంటి?
-
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023 -
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు... సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్‌సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు. నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్‌ఖడ్, బిర్లాలకు సీఆర్పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి. రేపు ఎంపీల ఫొటో సెషన్ ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్‌కు రావాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ కోరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది. -
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు...
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్నాడు. లోకాధి పత్యమే అభీష్టంగా గల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. -
ఒజ్జ గణపతికి వందనాలు
‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య! ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’ అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు. ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది. సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట. వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు. ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట! దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది. చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది. గణపతి పూజ మనకి ఏంచెపుతోంది? 1. మాతా పితృభక్తి అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు. 2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. 3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా! 4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది. 5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం. 6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు. డా. ఎన్.అనంతలక్ష్మి -
విశాఖలో పర్యావరణ హితంగా వినాయక చవితి
సాక్షి, విశాఖ: పర్యావరణహితంగా ఈసారి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి విశాఖలో విద్యార్థులు సిద్ధమయ్యారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సాక్షి మీడియా ఆధ్వర్యంలో రవీంద్ర భారతి స్కూల్లో చిన్నారుల చేతులతో మట్టి గణపతి అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేశారు కొందరు ఆ వినాయక విగ్రహాల్లో విత్తనాలను కూడా వేశారు పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తెలిపారు. విద్యార్థి దశలో ఈ రకమైన కార్యక్రమాల ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మట్టి వినాయకులు ఆకర్షణీయంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు తో సహా పలువురు అధికారులు హాజరయ్యారు ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కూడా జీవీఎంసీ చేపడుతుందని వివరించారు తమకు ఆనందం కలిగిస్తుందని విద్యార్థులు అన్నారు. విద్యార్థులను పర్యావరణహిత కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంపై రవీంద్ర భారతి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు. -
ఎవరైతే “ఈ వృత్తాన్ని" వినాయక చవితి రోజు వింటారో వాళ్లకు అనుగ్రహం కలుగుతుంది
-
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి
-
మహాగణపతికి 60 అడుగుల కండువా
సాక్షి, ఖైరతాబాద్(హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతికి ఈసారి కూడా 60 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలు తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. ఇదీ చదవండి: మా మట్టి గణపయ్య సాక్షి, హైదరాబాద్:వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. చదవండి: Hyderabad: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’ -
5న ‘మీ కోసం’ కార్యక్రమం రద్దు
ఏలూరు సిటీ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా 5వ తేదీ సోమవారం మీ కోసం కార్యక్రమం ఉండబోదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవరం జరిగే మీ కోసం కార్యక్రమం కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, సోమవారం వినాయకచవితి పర్వదిన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఆ రోజు మీ కోసం కార్యక్రమం జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి జిల్లాలో ఎక్కడా కూడా మీ కోసం కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ కోరారు.


