వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మరో వినూత్న కార్యక్రమం ముందడుగు పడింది. ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు.
(ఎక్కువ మంది చదవింది: ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్’పై స్టార్‌హీరోల ప్రశంసలు)
భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణ
కెమెకిల్స్‌తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను చిరంజీవి వివరించారు.
చిరంజీవికి కృతజ్ఞతలు
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను అభినందిస్తూ, ‘సీడ్ గణేశ’ కార్యక్రమానికి మద్దతు తెలిపిన చిరంజీవికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రోత్సాహకరమైన మాటలు మరింత మందిని పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకల వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులు పొందుతూనే.. ప్రకృతి పరిరక్షణను మన బాధ్యతగా గుర్తించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ‘గణేశుడిని పూజిద్దాం.. మొక్కను పెంచుదాం.. ప్రకృతిని కాపాడుదాం’ అనే సందేశంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
This Ganesh Chaturthi, I am happy to have Megastar Chiranjeevi garu unveil and launch the #SeedGanesha campaign. 🙏
Seed Ganesha is a small effort to bring together devotion and care for nature. Made with natural materials and seeds, the idol can be immersed at home after the… pic.twitter.com/iFcpX8D6En— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2026
ఇదీ చదవండి: ‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’


