వేరేలా కష్టపడొచ్చుగా.. హిజ్రాల తీరుపై బిగ్‌బాస్ అరియానా | Bigg Boss Ariyana Reacts Hijras Issue Housewarming Ceremony | Sakshi
Sakshi News home page

Bigg Boss Ariyana: అప్పులోళ్లలా వచ్చి ఎగబడతారు.. కష్టపడ్డొచ్చుగా

Aug 31 2026 1:05 PM | Updated on Aug 31 2026 1:09 PM

Bigg Boss Ariyana Reacts Hijras Issue Housewarming Ceremony

గ్రామాల్లో తక్కువగానీ నగరాల్లో అయితే కొత్తగా ఇంటి గృహప్రవేశం చేస్తున్నా షాపు ఓపెనింగ్ చేస్తున్నా సరే గుంపుగా కొందరు హిజ్రాలు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఒకవేళ ఇవ్వం అని అంటే నానా రచ్చ చేస్తారు. అందుకే వీళ్లకు భయపడి చాలామంది అడిగినంత డబ్బులు ఇచ్చేస్తుంటారు. రీసెంట్ టైంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

'నాకు నిజంగా తెలీదు ఇది ఎలా వెళ్తుందోనని. నా మనసులో ఉన్నది ఓసారి మీతో పెంచుకోవాలనుకుంటున్నాను. సరిగానే మాట్లాడుతున్నానో లేదా తప్పుగా మాట్లాడుతున్నానో తెలీదు కానీ ఇది నా మనసులో ఉంది. మనం చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటాం లేదంటే బిజినెస్ కోసం ఏదైనా షాప్ ఓపెన్ చేస్తాం. రూపాయి రూపాయి డబ్బు కూడబెట్టి గృహప్రవేశం వరకు వెళ్తాం. ఇంట్లో పూజ జరుగుతుందన్నప్పుడు.. అంతెందుకు మా ఇంటి గృహప్రవేశం టైంలోనూ ఇది జరిగింది. అప్పటికే డబ్బులన్నీ సెట్ చేసుకుని కార్యక్రమం చేసుకున్నాం. సడన్‌గా వస్తారు. బయట నంబర్ రాస్తాం. డబ్బులివ్వాలి అని అంటారు. లేదంటే మా వాళ్లు వస్తారు మాకు కమీషన్ మిగలదు అంటారు. మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. పూజ చేసుకున్నాం. అలాంటప్పుడు వాళ్లొచ్చి ఇంత డబ్బులు అంత డబ్బులు అని డిమాండ్ చేస్తుంటారు. ఆ టైంలో నిజంగా రూ.3 వేలైనా, రూ.10 వేలైనా సరిపోవు. రూ.25 వేలు అంటారు. రూ.50 వేలు అంటారు. రూ.లక్ష 16 వేలని అంటారు. ఇదంతా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది'

'మంచి రోజు. మనం కష్టపడి మరీ కట్టుకున్నాం. ఈ రోజు కోసమే మనం ఇంతలా కష్టపడింది అన్నప్పుడు సడన్‌గా పూజ అవుతున్నా సరే పట్టించుకోకుండా ఓ అప్పులోళ్లలా వచ్చి ఎగబడతారు. అసలు ఎగబడి ఇచ్చే ఆశీర్వాదం ఏంటని నాకు అర్థం కాలేదు. నంబర్ రాస్తే వేరే వాళ్లు రారు. ఇప్పుడు ఇవ్వకపోతే మిగతావాళ్లు వస్తారు. మాకు కమీషన్ మిగలదు అనడం ఏంటి? వేరేలా కూడా కష్టపడొచ్చు కదా! సంపాదించుకోవచ్చు కదా అనేది నా ఫీలింగ్. పూజ జరుగుతుంటే బ్యాడ్ వైబ్స్ ఇవ్వడం ఎందుకు? ఇదంతా ఎవరికీ హర్ట్ చేయాలని కాదు. నేను ఫీలైనది చెబుతున్నాను' అని అరియానా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement