వల్గర్ వీడియోలు.. దేనికి పనికొస్తాయని అడిగారు: ఉప్పల్ బాలు | Bigg Boss Telugu Agnipariksha: Uppal Balu Angry On Navdeep Over Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss Agnipariksha: నవదీప్‌ని టార్గెట్ చేసిన ఉప్పల్ బాలు

Aug 14 2026 11:38 AM | Updated on Aug 14 2026 11:43 AM

Bigg Boss Telugu Agnipariksha Uppal Balu Angry On Navdeep

శనివారం(ఆగస్టు 15) నుంచి బిగ్‌బాస్ తెలుగు అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రసారం కానుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు దీనిని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో మొత్తం 70 మంది సామాన్యులు పోటీపడగా వాళ్లలో 15 మందిని ఎంపిక చేశారు. వీళ్లకు పోటీలు పెట్టి ఐదారుగురిని బిగ్‌బాస్ 10వ సీజన్‌లోకి తీసుకోనున్నారు. అయితే తనకెలాంటి పోటీలు పెట్టకుండా అన్యాయంగా బయటకు పంపేశారని, దీనికి నవదీప్ కారణమని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఉప్పల్ బాలు వరస వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల.. రెండేళ్ల తర్వాత దొరికిన హీరో)

'మిడిల్ క్లాస్ వాళ్లంటే మనసుండదా? మేం ఎన్నోరోజుల నుంచి కష్టపడి వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటే ఓ ప్రశ్న అడగకుండా, టాస్క్ పెట్టకుండా.. మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? అవి వల్గర్‌గా ఉంటాయి అని అన్నారు. నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికొస్తాయి? మీరు ఎవరికైనా లక్ష రూపాయలు దానం చేశారా? ఎవరైనా పెళ్లయితే పుస్తె మెట్టలు ఇప్పించారా? మీరెలా మాట్లాడతారు సర్? అంటే మిడిల్ క్లాస్ వాళ్లం ఏం చేయలేం? మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు. మేమే తోపులం అనుకుంటున్నారా? మీకు అవకాశమిస్తే మీరక్కడ కూర్చున్నారు. ఏదో ఒకరోజు మీకు శాపం తగులుతుంది. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు. నవదీప్ గారు నేను అస్సలు వదిలిపెట్టను. అక్కడ ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి చెబుతాను. న్యాయం జరగాలి నాకు' ఉప్పల్ బాలు తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement