కొన్నిరోజుల క్రితం 'మైసా' షూటింగ్ సందర్భంగా గాయపడిన రష్మిక.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అయితే ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది అని చెబుతూ కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే తన పేరిట అన్నదానం కూడా నిర్వహించారని చెబుతూ ఓ వీడియోని పంచుకుంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)
'ఎప్పుడైనా ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే గడుస్తుంది. క్షణం తీరిక లేకుండా గడిపేవారికి విశ్రాంతి.. భయంగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిజీబిజీగా గడిపే పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది. బహుశా జీవితం అంటే ఇదేనేమో?' అని సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ పెట్టింది.
గతేడాది నవంబరులో 'గర్ల్ ఫ్రెండ్'తో హిట్ కొట్టిన రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. రెండు నెలల క్రితం 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీతో థియేటర్లలోకి వచ్చింది. భర్తతో కలిసి చేస్తున్న 'రణబాలి' షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' చేస్తోంది. దీని చిత్రీకరణలోనే తుంటి భాగానికి గాయమవగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అత్తారింట్లో రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా రష్మిక అమ్మ ఈమె దగ్గరకొచ్చి పలకరించింది.
(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ)


