అప్పట్లో వెంకీ, ఢీ, రెడీ లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీనువైట్ల.. కాలక్రమంలో ట్రెండ్‌కి తగ్గ మూవీస్ తీయలేక చాలా వెనకబడిపోయారు. అవే రొటీన్ కామెడీ చిత్రాలు తీయడంతో అవి పెద్దగా ఆడలేదు. చివరగా రెండేళ్ల క్రితం గోపీచంద్‌తో 'విశ్వం' తీశారు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంతో లాంఛనంగా మూవీ మొదలైంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)
శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త మూవీ చేస్తున్నారు. దీనికి 'జార్జ్ క్రిష్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జనవరి 14న సినిమా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ వదిలారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తుండగా అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. గతంలో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, నారీ నారీ నడుమ మురారీ లాంటి చిత్రాలతో సంక్రాంతికి హిట్స్ అందుకున్న శర్వానంద్.. ఈసారి ఏం చేస్తాడనేది చూడాలి?
(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక)


