breaking news
George Krish movie
-
ఇటు జార్జ్... అటు క్రిష్
శర్వానంద్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, గురువారం (సెప్టెంబరు 24) దర్శకుడు శ్రీను వైట్ల బర్త్ డే.ఈ సందర్భంగా ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఈ సినిమాలో క్రిస్టియన్ జార్జ్, హిందువు క్రిష్.... ఇలా రెండు విభిన్న మతాలకు చెందిన గెటప్స్‌లో శర్వానంద్ కనిపిస్తారు. ఈ రెండు పాత్రల చుట్టూ ఉన్న విభిన్న పరిస్థితులు ఏంటి? అనే ఆసక్తిని ఆడియన్స్‌లో క్రియేట్ చేసేలా ఫస్ట్ బూస్టర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశాం’’ అని యూనిట్ పేర్కొంది. అజయ్ సుంకర సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
జార్జ్ క్రిష్‌కి జోడీ ఫిక్స్
హీరో శర్వానంద్–దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఏటీవీ సమర్పణలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో లవ్ స్టోరీకి ప్రాధాన్యత ఉంటుంది. మానస పాత్ర కథలో కీలకం. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సంక్రాంతి పండగ సీజన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మామూవీ అలరించేలా ఉంటుంది. 2027 జనవరి 14న మా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
సంక్రాంతి బరిలో శ్రీనువైట్ల.. రెండేళ్ల తర్వాత దొరికిన హీరో
అప్పట్లో వెంకీ, ఢీ, రెడీ లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న శ్రీనువైట్ల.. కాలక్రమంలో ట్రెండ్‌కి తగ్గ మూవీస్ తీయలేక చాలా వెనకబడిపోయారు. అవే రొటీన్ కామెడీ చిత్రాలు తీయడంతో అవి పెద్దగా ఆడలేదు. చివరగా రెండేళ్ల క్రితం గోపీచంద్‌తో 'విశ్వం' తీశారు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన పూజా కార్యక్రమంతో లాంఛనంగా మూవీ మొదలైంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త మూవీ చేస్తున్నారు. దీనికి 'జార్జ్ క్రిష్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జనవరి 14న సినిమా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ వదిలారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తుండగా అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గతంలో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, నారీ నారీ నడుమ మురారీ లాంటి చిత్రాలతో సంక్రాంతికి హిట్స్ అందుకున్న శర్వానంద్.. ఈసారి ఏం చేస్తాడనేది చూడాలి?(ఇదీ చదవండి: పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది: రష్మిక)


