జార్జ్‌ క్రిష్‌కి జోడీ ఫిక్స్‌  | Manasa Varanasi to romance Sharwanand in Srinu Vaitla next George Krish | Sakshi
Sakshi News home page

జార్జ్‌ క్రిష్‌కి జోడీ ఫిక్స్‌ 

Sep 24 2026 5:07 AM | Updated on Sep 24 2026 5:07 AM

Manasa Varanasi to romance Sharwanand in Srinu Vaitla next George Krish

హీరో శర్వానంద్‌–దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జార్జ్‌ క్రిష్‌’. ఏటీవీ సమర్పణలో అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

 ‘‘ఈ సినిమాలో లవ్‌ స్టోరీకి ప్రాధాన్యత ఉంటుంది. మానస పాత్ర కథలో కీలకం. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సంక్రాంతి పండగ సీజన్‌లో కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మామూవీ అలరించేలా ఉంటుంది. 2027 జనవరి 14న మా సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement