‘భోగి’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.
కానీ ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కావడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ‘‘ఇటీవలే 30 రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌లో క్లైమాక్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా జరుగుతున్నాయి. పీరియాడికల్ వరల్డ్‌ని, యాక్షన్ సీన్స్‌ను విజువల్‌గా బాగా చూపించేందుకు టైమ్ కావాలి. అందుకే రిలీజ్‌ను వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది.


