బిగ్‌బాస్‌ నుంచి ఆమె ఎలిమినేట్‌.. మాస్క్ వీరులు వీళ్లే.. సండే హైలెట్స్‌ ఇవే..! | Bigg boss Season 10 Sunday episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss Season 10: బిగ్‌బాస్‌ నుంచి ఆమె ఎలిమినేట్‌.. మాస్క్ వీరులు వీళ్లే.. సండే హైలెట్స్‌ ఇవే..!

Oct 5 2026 7:39 AM | Updated on Oct 5 2026 7:40 AM

Bigg boss Season 10 Sunday episode Highlights

బిగ్‌బాస్ సీజన్ 10 అప్పుడే నాలుగోవారం పూర్తి చేసుకుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్‌పై ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఉంటారు. హౌస్‌లో నుంచి ఎవరు బయటికొస్తారనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంటుంది. అలా వీకెండ్‌ సండే బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఎవరు ఎలిమినేట్ అయ్యారో హైలెట్స్‌లో చూసేద్దాం. 

ఈ ఎపిసోడ్‌లో నాగ్ ఎంట్రీ ఇచ్చాక నామినేషన్లతో ఉన్న తొమ్మిది మందిలో ముకేశ్, దేబ్జానీ మొదట సేవ్ అయ్యారు.  అవుతారు. ఆ తర్వాత మిగిలిన ఏడు మంది నామినేషన్స్‌లో ఉంటారు. ఇక వీకెండ్‌ ఎపిసోడ్‌లో సరదా ఫన్‌ గేమ్స్‌ కూడా ఆడించారు. బాయ్స్, గర్ల్స్‌ను రెండు టీమ్స్‌గా విడదీసి గేమ్ ఆడుతారు. నాగ్ సినిమా హీరో పేరు చెప్పి వాళ్ల నటించిన క్యారెక్టర్ ఫోట్ చూపిస్తే ఆ సినిమా పేరు చెప్పాలి. అలా ఇందులో గెలిచిన వాళ్లు డ్యాన్స్ చేస్తారు. ఈ గేమ్‌లో బాయ్స్ గెలుస్తారు.

ఈ సండే ఎపిసోడ్‌లో పలు రకాల ఫన్ గేమ్స్ ఆడుతూ సందడి చేస్తారు. ఇంటి సభ్యులు నలుగురిని పిలిచి ఓ ప్రశ్న అడుగుతారు. గెలిచిన వాళ్లకి చాక్లెట్ ఇస్తారు. అయితే ఆ చాక్లెట్ మధ్యలో ఉసిరి కాయలు, కాకరకాయ ఇలా రకరకాలు పెట్టి ఉంటారు. దేబ్జానీ, వంశీ, నరేశ్, వర్షిణి, షాలిని, ముకేశ్, త్రిగుణ్, చరణ్, రాంప్రసాద్ వీరంతా చాక్లెట్స్ తింటారు. ఆ తర్వాత నాగ్ ఇంటి సభ్యులు అందరికీ గత వారంలో బాగా ఆడింది.. ఎవరు.. స్టార్ ఆఫ్‌ ది వీక్ ఎవరు అని అడుగుతారు. ఇందులో సృష్టి, ఝాన్సీ, వంశీలకు 4 ఓట్లు వస్తాయి.. మళ్లీ ఓటింగ్ పెడితే ఝాన్సీకి 6 ఓట్లు రావడంతో ఆమెనే స్టార్ ఆఫ్‌ది వీక్ అవుతుంది. ఆ తర్వాత ఒక పడవలో ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఉంచి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిని ముంచేస్తారంటూ సరదాగా ఫన్‌ గేమ్ ఆడిస్తారు నాగ్. ఇందులో నరేశ్ రాంప్రసాద్‌ని ముంచేసి దేబ్జానీని కాపాడుతా.. రాంప్రసాద్‌కి ఈత వచ్చు కదా అనడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి.

ఇక చివరికీ నామినేషన్స్‌లో ఉన్న సృష్టి, షాలిని, అమన్, రోహిత్‌లలో రోహిత్, అమన్ సేవ్ అవుతారు. ఆ తర్వాత చివరికీ సృష్టి, షాలిని మాత్రమే మిగులుతారు. షాలిని.. రోహిత్ చేయి పట్టుకొని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.. ఒక వేళ నేను వెళ్లిపోతే నువ్వు ఇంకెవరికీ కనెక్ట్ అవ్వవని అనుకుంటున్నా.. బయట కూడా మనం ఇలాగే ఉంటామని అంటుంది. నువ్వు వెళ్లవులే అని రోహిత్ అంటాడు. ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన సృష్టి ఇంటినుంచి బయటికి వచ్చేస్తుంది. చివర్లో సృష్టి స్టేజ్ మీదకు వెళ్లగానే బిగ్‌బాస్ జర్నీ చూపిస్తారు. హౌస్‌లో ఇంకా మాస్క్ తీయని వాళ్లు ఎవరని సృష్టిని అడగ్గా.. ముకేశ్, రాంప్రసాద్, వర్షిణి పేర్లు చెబుతుంది. దీంతో సండే ఫన్‌డే ఎపిసోడ్ ముగుస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement