breaking news
Bigg Boss 10
-
'బిగ్‌బాస్' త్రిగుణ్ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
-
బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ కృష్ణుడు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
Big Boss: కన్నీళ్లు పెట్టుకున్న హౌస్ మేట్స్..
-
ఆ నలుగురు సేఫ్.. ఆ ఇద్దరు వరస్ట్.. వీకెండ్ హైలెట్స్ ఇవే..!
బుల్లితెర రియాలిటీ షో అప్పుడే రెండో వారం చివరికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఈ వారం నేను చాలా ఎంజాయ్ చేశానని నాగ్ అన్నారు. అయితే ఈ వారంలో ఇద్దరు హౌస్‌లో ఉన్నట్లు అనిపించలేదని తెలిపారు.ఆ ఇద్దరు కృష్ణుడు, సృష్టి అని తెలియజేస్తూ ఓ వీడియోను చూపించారు. ఈ వారంలో వాళ్లిద్దరు హౌస్‌లో ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో వాళ్లద్దరినీ స్టోర్ రూమ్‌కు పంపించారు. అదే క్రమంలో సింగర్ ఝాన్సీపై ప్రశంసలు కురిపించారు. హౌస్‌లో నువ్వే తొలి మహిళ కెప్టెన్ అని కొనియాడారు. ఆటను వందశాతం ఎఫర్ట్‌తో ఆడుతున్నావని అన్నారు.హౌస్‌మేట్స్‌ను తమ లైఫ్‌లో జరిగిన సీక్రెట్ విషయాన్ని చెప్పాలని నాగ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్ తమ జీవితంలోని జరిగిన సంఘటలను రామ్ ప్రసాద్, త్రిగుణ్, వంశీ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత హౌస్‌లో మానిపులేటర్, పప్పెట్స్ ఎవరంటూ నాగ్ హౌస్‌మేట్స్‌ను అడిగారు.సుధీర్‌ను వర్షిని మానిపులేట్ చేస్తోందని చరణ్ అన్నారు. ఆ తర్వాత గేమ్‌లో రూల్స్ చదవకుండా గేమ్ ఆడతావా అని చరణ్‌ను నాగ్ ప్రశ్నించారు. ఇది మళ్లీ రిపీట్ చేయొద్దని సూచించారు. ఆ తర్వాత రామ్ ప్రసాద్‌ను మానిపులేటర్ ఎవరని అడగ్గా.. వంశీని త్రిగుణ్ కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. త్రిగుణ్ చేతిలో వంశీ పప్పెట్ అని తేలిపోయింది. రోహిత్ సైతం వంశీ, త్రిగుణ్‌నే ఎన్నుకున్నారు.సంచాలక్‌గా ఇద్దరు ఫెయిల్..సంచాలక్‌గా రామ్ ప్రసాద్ ఫెయిల్ అయ్యావంటూ నాగ్ అన్నారు. దీనికి అవును సార్ అంటూ రామ్ ప్రసాద్ తన తప్పును అంగీకరించారు. ఆ తర్వాత హౌస్‌లో చరణ్‌ను రోహిత్ మానిపులేట్ చేస్తున్నారని వర్షిని చెప్పింది. దీనికి ఆడియన్స్ పోల్ నిర్వహించగా.. అవుననే ఎక్కువమంది ఓటేశారు.ఆ తర్వాత వర్షినిని సంచాలక్‌గా సరిగ్గా వ్యవహరించలేదని నాగ్ అన్నారు. సంచాలక్‌గా మీ నిర్ణయం కరెక్ట్‌గా లేదని.. అందుకే ఈ వారంలో నువ్వు సంచాలక్‌గా ఉండడానికి వీల్లేదని నాగార్జున చెప్పేశారు. గేమ్‌లో భాగంగా షాలిని, వర్షిణి మధ్య జరిగిన ఫైట్‌లో షాలినిదే తప్పని నాగ్ తేల్చేశారు. ఈ వారంలో ముకేశ్, దేబ్జానీ, ఝాన్సీ, శాలిని సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత త్రిగుణ్, కృష్ణుడు, సృష్టి, సుధీర్, వర్షిణి, రోహిత్ అన్‌సేఫ్‌గా మిగిలారు. -
కెప్టెన్సీ పోరు.. షాలిని వర్సెస్ వర్షిణి.. హౌస్‌లో మాటల యుద్దం..!
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ నడుస్తోంది. హౌస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు కంటెస్టెంట్స్ శతవిధాల పోటీపడుతున్నారు. ఈ రేసులో ఐదుమంది పోటీలో నిలిచారు. వీరికి బిగ్‌బాస్ టాస్క్‌లు పెట్టి పరుగులు పెట్టించాడు. పదిమంది కంటెస్టెంట్స్‌ను గార్డ్స్‌గా పెట్టగా.. మిగిలిన ఐదుగురు వాళ్లను దాటుకుంటూ వెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలి.ఈ టాస్క్‌లో షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం జరిగింది. షాలినిని వయసులో నువ్వు చిన్నదానివంటూ వర్షిణి అనడంతో మాటమాట పెరిగింది. దీంతో కాసేపు వీరిద్దరి మధ్య మాటలతో బిగ్‌బాస్ హౌస్ హోరెత్తింది. ఈ ప్రోమో చూస్తుంటే కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి ఎపిసోడ్లో కెప్టెన్సీ ఎవరినీ వరిస్తుందో తెలియాలంటే మీరూ కూడా బిగ్‌బాస్ చూసేయాల్సిందే. -
వర్షిణి & ముకేశ్ లవ్? చరణ్ కు బిగ్ షాక్
-
బిగ్‌బాస్ లేటేస్ట్ ప్రోమో.. గేమ్‌లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-10 అప్పుడే పదో రోజుకు చేరుకుంది. రెండో వారంలో నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ మధ్య ఆటల పోటీ మొదలైంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లతో హౌస్మేట్స్ పోటీ పడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ హాట్‌హాట్‌గా సాగుతోంది.తాజాగా పదో రోజుకు సంబంధించిన రెండో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో బ్యాగ్ కోసం పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. ఈ గేమ్‌లో రెండు టీమ్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. హౌస్‌లో అసలేం జరిగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఝాన్సీ టార్గెట్ రోహిత్..? ఈ వీక్ కెప్టెన్ ఎవరంటే?
-
షాలినీపై నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు.. బిగ్‌బాస్ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్
బిగ్‌బాస్ సీజన్-10లో నామినేషన్ కారణంగా చైత్ర ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా నరేశ్ చేసిన వ్యాఖ్యలపై చైత్ర స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే వెలిశారుచైత్రను ప్రస్తావిస్తూ.. నిన్నటి ఎపిసోడ్లో నరేశ్.. షాలినీ ఎలిమినేషన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో చైత్రను ప్రస్తావిస్తూ ఆమెతో జరిగిన గొడవను గుర్తు చేశాడు. ‘ఆ రోజు చైత్రకు సారీ చెప్పాల్సింది పోయి.. తిరిగి ఆమెనే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పేలా చేశావు. అది సరైనది కాదు’ అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మీమ్ రూపంలో.. ఈ క్లిప్‌ను చైత్ర తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీమ్ రూపంలో షేర్ చేసింది. అంతేకాకుండా నరేశ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ‘బాగా చెప్పాడు’ అంటూ తన రియాక్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో చైత్ర, షాలినీ మధ్య ఓ విషయంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైత్రనే షాలినీకి సారీ చెప్పింది. ఈ పరిణామంతో ఆమె హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే ఘటనను నరేశ్ ప్రస్తావించడంతో.. చైత్ర ఈ క్లిప్‌ను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. View this post on Instagram A post shared by ₵Ⱨ₳ł₮ⱧⱤ₳Ɽ₳ł17.ⱧØⱠł₵ (@chaithrarai17.holic) -
గిన్నెలు గట్టిగా తోమిండు.. కానీ, ఈ వీక్ కెప్టెన్ ఎవరంటే?
-
నాయకత్వం అంటే ఇది కాదు.. సీఎం విజయ్ గురించేనా ఇదంతా?
ఇదంతా సోషల్ మీడియా జమానా. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరి మనోభావాలు హర్ట్ అవుతాయో చెప్పలేం. ఒకరి గురించి మాట్లాడితే మరొకరి గురించి మాట్లాడినట్లు అనిపించొచ్చు. ఇప్పుడు ఈ ఉపోధ్ఝాతం అంతా ఎందుకంటే.. తమిళ బిగ్‌బాస్‌లో రాజకీయ రగడ రేగింది. హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన కొన్ని కామెంట్స్.. ముఖ్యమంత్రి విజయ్‌ని ఉద్దేశించినవా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: త్రిగుణ్‌ని చెడుగుడు ఆడేసుకున్న సుధీర్.. నామినేషన్స్‌లో రచ్చ)తెలుగుతో పాటు తమిళంలోనూ గతవారమే బిగ్‌బాస్ షో మొదలైంది. మన దగ్గర ఇంకా కెప్టెన్సీ పోటీ ప్రారంభం కాలేదు. తమిళ సీజన్లో మాత్రం గతవారం కెప్టెన్సీ పోటీని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తరహాలో నిర్వహించారు. అంటే కెప్టెన్ కావాలనుకునే హౌస్మేట్స్.. గెలిపేస్తే ఇది చేస్తాం అది చేస్తామని వాగ్దానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే విజేతగా నిలిచిన సతిగా అనే అమ్మాయి ఇలా చాలా ప్రామిస్‌లు చేసింది. కానీ విజేత అయిన తర్వాత వాటిని నెరవేర్చలేకపోయింది. దీంతో వీకెండ్ వచ్చిన హోస్ట్ విజయ్ సేతుపతి ఈమెకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు.సతిగా చేసిన వాటిని విమర్శించే క్రమంలో హోస్ట్ విజయ్ సేతుపతి.. 'హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదు. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదు' అని అన్నాడు. అయితే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ, నాయకుడు పేరు గానీ చెప్పలేదు. కానీ సేతుపతి.. సీఎం విజయ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు ట్రోల్స్ చేశారు.దీంతో విజయ్ అభిమానులు.. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మరోవైపు ఈ షో ప్రసారమవుతున్న విజయ్ టీవీ కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. బిగ్‌బాస్ తమిళ సీజన్ 10.. షో ఫార్మాట్, థీమ్స్, గేమ్ వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన వినోద కార్యక్రమం. ఇందులోని పరిస్థితులు, డైలాగ్స్, అభిప్రాయాలు షోలో భాగంగానే చూడాలి. కార్యక్రమంలో కనిపించే వ్యాఖ్యలకు బయట ఉన్న ఏ వ్యక్తి, సంస్థ, వ్యవస్థతో సంబంధం లేదని పేర్కొంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10 తెలుగు: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)#VijaySethupathi Directly attack Someone🙄🤔#BiggBoss10Tamil #BiggBossTamil10 #BiggBossTamil #BiggBoss pic.twitter.com/3Pts1Wonfz— Dinesh Kumar👁 (@DineshKumaaaar) September 12, 2026pic.twitter.com/VQ0MrMZZYN— Vijay Television (@vijaytelevision) September 14, 2026 -
స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?
-
Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!
-
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్‌బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుఊహించలేరు..‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అంటూ హెచ్చరించాడు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్ఒకసారి మాట్లాడుకోండి..అంతేకాదు.. రెడ్ గ్రూప్‌లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని వ్యాఖ్యానించాడు. దీంతో అసలు అతడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే టాస్కులు, టీమ్‌ల మధ్య గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వార్నింగ్ మరింత మంట రాజేసేలా కనిపిస్తోంది. నామినేషన్స్‌లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానని చెప్పడంతో.. రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640— AnantapurBO (@AnantapurBO) September 8, 2026 -
జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!
-
FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?
-
వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Bigg boss 10 : బిగ్‌బాస్ ఇంట్లో తొలిరోజే రచ్చ.. ‘నాయకుడి’ కోసం పెద్ద గొడవ!
బిగ్‌బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్‌లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్‌కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్‌పై ఓ లుక్కేయండి..మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!బిగ్‌బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్‌ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్‌ను దక్కించుకున్నారు.రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్బిగ్బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్‌ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్‌గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్‌తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..ఇక హౌస్‌లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్‌లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్‌ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్‌లో గొడవకిచెన్లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.నామినేషన్స్‌పై నరేష్, రాం ప్రసాద్ కామెడీమరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్‌బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.ముందుగా త్రిగుణ్‌కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్‌ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్‌లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్‌ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ గౌడ: ఇతరుల పవర్‌ను రివర్స్ చేసే అవకాశంవర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్కృష్ణుడు: ‘స్వాప్’ పవర్షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశంనరేష్: నామినేషన్స్‌లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవఆ తర్వాత హౌస్‌లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్‌తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్‌బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్‌బాస్.. క్యూట్‌గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్‌బాస్‌కు సారీ చెప్పింది. దీనికి బిగ్‌బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.హౌస్‌మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్‌మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్‌బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్‌లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.లీడర్‌గా రోహిత్.. రాంప్రసాద్టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్‌కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్‌ను లీడర్‌గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్‌కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్‌గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.త్రిగుణ్‌పై షాలినీ, శ్రిష్టి ఫైర్త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్‌లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్‌బాస్ ఇంట్లో రెండు టీమ్‌లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్‌కు రాం ప్రసాద్, రెడ్ టీమ్‌కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్‌మేట్స్‌గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి. -
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)
-
మలయాళం బిగ్‌బాస్‌లో ‘గంధర్వ’ హీరోయిన్
మిస్ కేరళ-2014 విజేతగా గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి సురేశ్.. తాజాగా ‘బిగ్‌బాస్ మలయాళం 8’లోకి అడుగుపెట్టారు. మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి.. సినిమాల నుంచి రియాలిటీ షో వైపు అడుగులు వేయడం విశేషం.మిస్ కేరళ టైటిల్ గెలుచుకున్న తర్వాత గాయత్రి సురేశ్ సినిమాల్లోకి ప్రవేశించారు. కుంచాకో బోబన్ సరసన నటించిన ‘జమ్నా ప్యారి’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘కరింకున్నం 6ఎస్’, ‘ఒరే ముగమ్’, ‘ఒరు మెక్సికన్ అపరాథ’ తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. కొంతకాలం బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌కు కొంతకాలం విరామం ఇచ్చారు.తాజాగా ‘డిస్కో’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. ఆంటోనీ పెపే, అర్జున్ అశోకన్, చెంబన్ వినోద్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గాయత్రి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ‘హీరో హీరోయిన్’, ‘నేను లేని నా ప్రేమ కథ’, ‘గంధర్వ’ తదితర చిత్రాల్లో నటించారు. ర్యాంప్ వాక్ మోడల్‌గా కూడా గుర్తింపు పొందిన గాయత్రి.. సోషల్ మీడియాలో తన ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ మలయాళం నాలుగో సీజన్‌కు ముందు గాయత్రి సురేశ్ షోలో పాల్గొంటారనే ప్రచారం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించిన విషయాన్ని అప్పట్లో ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఆ సీజన్లో తాను కంటెస్టెంట్‌గా పాల్గొనడం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే భవిష్యత్‌లో ఏదైనా సీజన్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి రావచ్చని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. ఆమె అన్నట్టుగానే ఇప్పుడు బిగ్‌బాస్ మలయాళం 8లో గాయత్రి సురేశ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న గాయత్రి.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తారో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు! -
బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
బిగ్‌బాస్ సీజన్ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్‌లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.బిగ్‌బాస్ సూచనల మేరకు..తొలి టాస్క్‌లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్.. రాంప్రసాద్, త్రిగుణ్‌తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?మీతో ఆడితే గెలవచ్చు..ఇక త్రిగుణ్ మరో టీమ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్‌లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్‌బాస్ 10లోకి వచ్చేశాడు View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
బిగ్‌బాస్ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 10) గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్‌లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్ అయింది.తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్‌బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్‌గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో ఝాన్సీ హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్‌ని కూడా హౌస్‌లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్, రాజకుమారి, రోహిత్, అమన్ కచ్చితంగా బిగ్‌బాస్ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, నరేశ్, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, ముఖేష్, చైత్ర రాయ్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, ఎక్స్‌ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్ 6) స్పష్టత రానుంది. సీజన్ 10కి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?
-
ప్లీజ్.. దయచేసి నన్ను తీసుకోండి: ఉప్పల్ బాలు రిక్వెస్ట్
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా రియాలిటీ వచ్చేనెలలో ప్రారంభ కానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేసిన మేకర్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండనుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ షోలో పాల్గొనే వారికోసం అగ్నిపరీక్ష పేరుతో కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు.అయితే అగ్నిపరీక్షలో ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఉప్పల్ బాలు జడ్జిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నవదీప్ తనను అవమానించాడని వాపోయారు. తన వీడియోలు వల్గర్‌గా ఉంటాయని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎంపిక చేయనందుకు జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు. తాజాగా ఉప్పల్ బాలు మరో వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు విమర్శలు చేసిన ఉప్పల్ బాలు.. తాజాగా బిగ్‌బాస్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా తనను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాలని నాగార్జునతో పాటు మాటీవీని కోరారు. ఇది నా లాస్ట్ వీడియో అని.. తనకు అవకాశమిస్తే తప్పకుండా ఈ షో రేటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు. నేను బిగ్‌బాస్ వెళ్లాలని నా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని విజ్ఞప్తి చేశాడు. ఏ టాస్క్ ఇచ్చినా ఆడతానని.. ఫుల్ కామెడీ చేస్తానని ఉప్పల్ బాలు వేడుకుంటున్నారు. View this post on Instagram A post shared by uppal balu (@uppalbaluofficial) -
మాట జాగ్రత్త.. నా గురించి తెలుసు కదా?.. బిందు మాధవికి నటరాజ్ వార్నింగ్
బిగ్‌బాస్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో బిందు మాధవితో ఆయనకు జరిగిన గొడవ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఓ నామినేషన్ టాస్క్‌లో బిందు మాధవిని ‘శూర్పణఖ’ అంటూ నటరాజ్ మాస్టర్ బాణాలు విసరడం.. అందుకు ఆమె కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం అప్పట్లో హైలైట్‌గా నిలిచింది. తాజాగా అదే అంశం మరోసారి తెరపైకి రావడంతో నటరాజ్ మాస్టర్ తీవ్రంగా స్పందించారు.ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కామనర్స్‌కు అవకాశం కల్పిస్తూ భారీ స్థాయిలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా టాప్ 15 ఫైనలిస్టులను ఎంపిక చేసి.. వారిలో కొందరిని బిగ్‌బాస్ సీజన్ 10లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎంపిక బాధ్యతలను బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1 విజేత బిందు మాధవి, బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ సీజన్ 1 ఫైనలిస్ట్ నవదీప్‌లకు అప్పగించారు.ఇదిలా ఉంటే.. అగ్నిపరీక్షకు వచ్చిన ఓ ఆర్జేకు జడ్జీలను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చారు. తాను బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మాత్రమే కాకుండా.. షో తర్వాత బజ్ ఇంటర్వ్యూలు చేసే స్థాయికి ఎదగాలని ఉందని అతను చెప్పడంతో అతడితో బజ్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన వివాదాన్ని ప్రస్తావించాడు.‘‘శూర్పణఖ.. ఇదిగో నా బాణం’ అంటూ అప్పట్లో నటరాజ్ మాస్టర్ బిందు మాధవిపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఆ సమయంలో మీకు ఎలా అనిపించిందని ఆర్జే ప్రశ్నించాడు. దీనికి బిందు మాధవి స్పందిస్తూ.. తాను చాలా ఇరిటేట్ అయ్యానని, అయితే అలాంటి వాళ్లు కూడా ఉండాలి కాబట్టి వారికి థాంక్స్ చెప్పాలని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. బిందు మాధవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘అలాంటోళ్లు కూడా ఉండాలా? అలాంటోళ్లు అంటే ఏంటి? మాట జాగ్రత్త’ అంటూ బిందు మాధవిని ప్రశ్నించారు.‘ఏమన్నావ్.. అలాంటోళ్లు కూడా ఉండాలా? అలాంటోళ్లంటే ఏంటి? మాట జాగ్రత్త.. అలాంటోళ్లేంటి? అసలు ఏమనుకుంటున్నావ్.. ఒక ఫ్లాట్ ఫామ్‌పై కూర్చుని మాట్లాడితే ఏమైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తరువాత నేను కూడా చాలా ఇంటర్వ్యూలలోమాట్లాడాను. అంతా అయిపోయింది. గేమ్ ఈజ్ గేమ్ అనుకుని అంతా మార్చిపోయి.. నా పాప బర్త్ డేకి కూడా నిన్ను పిలిచాను. కానీ ఇప్పుడు వాళ్లు ఏదో ఉత్సాహంతో అడిగారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి.. అవన్నీ తట్టుకున్నాను కాబట్టే గెలిచాను అని అనాలి. నిన్ను నువ్వు హైలైట్ చేసుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేయించుకో.. హడావిడి చేసుకో. నీ అలాంటోళ్లు అని అంటున్నావ్ ఏంటి? అక్కడ అన్నది నేనే కదా? వాళ్లు వీళ్లైతే ఏమీ అనకుండా ఉంటారేమో. కానీ అక్కడన్నది నేను కదా. నన్ను ఆ ప్లాట్‌ఫామ్‌పై ‘అలాంటోళ్లు’ అని అన్నావ్ కదా.. ఆ మాట వెనక్కి తీసుకో. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో.. నాతో పెట్టుకోకు. నేను ఒక్కటే చెప్తున్నా.. అగ్నిపరీక్షకి వచ్చిన వాళ్లకి అవన్నీ అవసరం. అందుకే వాళ్లు భరిస్తున్నారు. మీరు ఎన్ని అన్నా పడుతున్నారు. కానీ నాకు అవసరం లేదు. నువ్వు అలాంటి వాళ్లు అంటూ నా గురించి మాట్లాడాల్సినంత సీన్ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో. గెలిచాను అని గొప్పగా చెప్పుకో. పొడిచేశాను అని చెప్పుకో. కానీ అలాంటోళ్లు ఇలాంటోళ్లు అని మాత్రం అనకు. మాట జాగ్రత్త. నేను అందరిలా కాదు ఊరుకోవడానికి. తెలుసు కదా మన గురించి’ అంటూ వీడియో ద్వారా బిందు మాధవికి వార్నింగ్ ఇచ్చారు. View this post on Instagram A post shared by Natraj Kasturinatraj (@natraj_master) -
అలాంటి వాళ్లు 'బిగ్‌బాస్'కి రావొద్దు: నవదీప్
ప్రస్తుతం 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష షో ప్రసారమవుతోంది. అయితే దీని జడ్జిల్లో ఒకటైన నవదీప్ తనని అవమానించాడని ఉప్పల్ బాలు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరస పెట్టి వీడియోలు చేస్తున్నాడు. తన చావుకు నవదీప్ కారణమని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో అందరూ బాలుకి సపోర్ట్ చేస్తూ నవదీప్ తీరుని విమర్శిస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు నవదీప్ స్పందించాడు. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి అందరి కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు)'బిగ్‌బాస్ అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఓ షో. 100 మంది రకరకాల మనస్తతత్వాల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఆ మాటలని ఎలా తీసుకుంటాం, ఎలా కంట్రోల్ చేసుకుంటామనేదే పాయింట్. దానిని పరీక్షించడానికే మమ్మల్ని జడ్జిలుగా పెట్టారు. వచ్చిన కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్‌పై ఎలా స్పందిస్తారు అనేది చూసేందుకే వాళ్ల సహనాన్ని పరీక్షిస్తాం. కంటెస్టెంట్ స్పందన ఎలా అయినా ఉండొచ్చు. జడ్జిగా వెళ్లే ముందే నాకు ఆ విషయం తెలుసు. హారర్ సినిమాకు వచ్చి బయపెట్టొద్దు అంటే ఎలా? ఎవరు ఎన్ని మాటలు అన్నా తట్టుకుని నిలబడాలనేదే ఈ కాన్సెప్ట్. 'అగ్నిపరీక్ష' అంటేనే ట్రిగర్ చేయడం. నా లాంటి వాళ్లు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నిలబడే శక్తి ఉందా? ఉంటేనే రండి. అగ్నిపరీక్ష డిజైన్ చేసిందే దానికోసం. అలా తట్టుకుని నిలబడేవాళ్లే షోకు రండి లేదంటే రావొద్దు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు: పల్లవి ప్రశాంత్) View this post on Instagram A post shared by Nav Deep 2.0 (@pnavdeep) -
'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ షో మొదలవనుంది. వచ్చే నెల నుంచి 10వ సీజన్ షురూ కానుందని లేటెస్ట్గా ప్రోమో వదిలారు. ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం పక్కనబెడితే అగ్నిపరీక్ష కారణంగా సోషల్ మీడియాలో షోపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇంకా చెప్పాలంటే జడ్జిల్లో ఒకరైన నవదీప్‌ని పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? దీనికి ఏంటి కారణం?ఈ షో మొదలైన తర్వాత 8 సీజన్ల వరకు పల్లవి ప్రశాంత్ లాంటి సామాన్యులని పలువురిని తీసుకున్నారు గానీ వారిని ఎలా ఎంపిక చేశారు లాంటివి బయటపెట్టలేదు. కానీ గతేడాది అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెట్టి, ఆరుగురు సామాన్యులని ఎంపిక చేసి షోలో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో ఒకడైన కల్యాణ్ పడాల ఏకంగా విజేత కూడా అయ్యాడు. ఈసారి అలానే అగ్నిపరీక్ష పోటీ నిర్వహించారు. వేలాది అప్లికేషన్లు రాగా వాటిలో 70 మందిని ఎంచుకుని వాళ్లలో 15 మందిని ఫైనల్ చేశారు.ఆ 15 మంది ఎవరనేది జనాలకు కూడా పెద్దగా తెలీదు కాబట్టి ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. అయితే రిజెక్ట్ అయిన మిగిలిన 55 మందిలో ఉప్పల్ బాలు, అక్షయ్ లాంటి జనాలకు తెలిసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్లని ఏ కారణాలతో రిజెక్ట్ చేశారో పక్కనబెడితే వీరిద్దరితో పాటు మరికొందరు ఏకంగా చిన్నాచితకా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ జడ్జిలైన నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లని ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు.ఓ షో కోసం ఒక వ్యక్తిని తీసుకోవాలా వద్దా అనేది జడ్జిలతో పాటు నిర్వహకులకు ఉండే చాలా లెక్కలపై ఆధారపడి ఉంటుంది. దీని వెనక పెద్ద తతంగం ఉంటుంది. కానీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టరీతినా ఏకంగా జడ్జిలనే తిడుతుండటం షోపై వ్యతిరేకత పెంచుతోంది. పోనీ ఈ ఇన్ఫుయెన్సర్లు ఏమైనా సమాజానికి పనికొచ్చేది చేస్తున్నారా అంటే కాదు. ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ వీడియోలో లేదంటే మోటివేషన్ వీడియోలో చేస్తూ ఫాలోవర్లని సంపాదించుకుంటున్నారు. అలాంటి వీళ్లు.. తమని రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.షో మొదలుకాకముందే ఇలా ఉందంటే.. ఒకసారి ప్రారంభమైన తర్వాత ఇంకెన్ని విమర్శలు, ట్రోల్స్ వస్తాయోననే సందేహం కలుగుతోంది. గతేడాది కల్యాణ్ పడాలని విజేత చేసినప్పుడే చాలామంది సందేహపడ్డారు. తనూజ విజేత కావాల్సిన కంటెస్టెంటే కానీ కల్యాణ్ ఎలా విన్నర్ అయ్యాడు అని మాట్లాడుకున్నారు. పోని షో అయిపోయిన తర్వాత విజేతలకు వరస ఛాన్సులు వచ్చాయా అంటే అలాంటిదేం జరగలేదు. ఒకటి రెండు అవకాశాలు వచ్చాయంతే! -
మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని అమ్మనాన్న ఏడ్చారు
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రేపటి(ఆగస్టు 15) నుంచి ప్రసారం కానుంది. ఈ పోటీలో 70 మంది సామాన్యులు పాల్గొనగా 15 మంది తుది పోటీ కోసం ఎంపికయ్యారు. వీళ్లలో మిగతా అందరికంటే సూర్యాపేట్కి చెందిన రైతు, సింగర్ ఝాన్సీని ప్రోమోల్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన విషయాలని ఎమోషనల్‌గా చూపిస్తున్నారు. మరి ఈమె ఏం చెప్పింది? ఫైనల్-15కి సెలెక్ట్ అయిందా? లిస్టులో ఎవరెవరున్నారంటే?(ఇదీ చదవండి: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. ఫోన్లో ఫొటోలు తీసుకోను: నాగ్)ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కష్టాలు ఏముంటాయి? అని జడ్జి నవదీప్ ఈమెని అడగ్గా.. 'పెట్టుబడి పెట్టందే పంట పండదు. చివరకొచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు. కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలిపెట్టలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రకృతితోనే పోటీపడాలి. నేను పుట్టినప్పుడు మళ్లీ ఆడబిడ్డ పుట్టిందని మా అమ్మవాళ్లు ఏడ్చారు. ఈ రోజు నువ్వు కన్నది ఆడపిల్లని కాదు నలుగురికి స్పూర్తిగా ఉండే ఓ మగరాయుడు లాంటి బిడ్డని కన్నావ్ అని అంటున్నారు' అని ఝాన్సీ చెప్పుకొచ్చింది.ఇకపోతే అగ్నిపరీక్ష తుదిపోటీలకు ఎంపికైన వారిలో రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో నుంచి బిగ్ బాస్ 10వ సీజన్లోకి ఎవరు అడుగుపెడతారానేది షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు తెలిసే అవకాశముంది.వచ్చే నెలలో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ కొత్త సీజన్ కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలని టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆటో రాంప్రసాద్ దాదాపు ఖరారు కాగా యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్‌ప్రెస్ హరి, ఆషిక, నూకరాజు, పల్లవి గౌడ లేదా పల్లవి రామిశెట్టి లాంటి టీవీ సెలబ్రిటీలు ఈసారి షోలోకి రానున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు) -
'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష.. అభిజిత్ పరువు తీసిన కంటెస్టెంట్!
ప్రతి ఏడాది ప్రసారమయ్యే 'బిగ్‌బాస్' షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కంటెంట్, గొడవలపై విమర్శలు వస్తుంటాయి. అదే టైంలో చూసేవాళ్లు రోజూ చూస్తూనే ఉంటారు. ఎనిమిది సీజన్ల వరకు సెలబ్రిటీలకే ఎక్కువగా అవకాశమిచ్చారు. గతేడాది టెలికాస్ట్ అయిన 9వ సీజన్ నుంచి మాత్రం సామాన్యులకు కూడా హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చారు. దీనికి అగ్నిపరీక్ష పేరుతో పోటీ కూడా నిర్వహించారు. ఈసారి అగ్నిపరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ శనివారం నుంచి గేమ్ మొదలవనుంది. ఈ క్రమంలోనే ప్రోమో వదిలారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్)ఈసారి అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి 70 మంది అగ్నిపరీక్షలో పోటీపడబోతున్నారు. రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ముగ్గురు బాగా హైలెట్ అయ్యారు. వీళ్లలో ఒక అమ్మాయి రైతుగా ఊరిలో పనిచేస్తూ పల్లె పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు తొలిదశలో గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే తెలుగుని వెనక నుంచి ముందుకు తిప్పి రాసే మరో అమ్మాయి కూడా ఆకట్టుకుంది.చివరగా ఓ కుర్రాడు.. జడ్జి సీటులో కూర్చున్న 4వ సీజన్ విజేత అభిజిత్‌కే కౌంటర్ వేశాడు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఎక్కడా కనిపించకుండా పోయారు అని పరువు తీసేలా మాట్లాడాడు. దీంతో హర్ట్ అయిన అభిజిత్.. ఏం మాట్లాడుతున్నావ్? మాకేం పనిలేదని అనుకుంటున్నావా? అని సీరియస్ అయ్యాడు. ఇకపోతే వచ్చే నెల తొలివారం నుంచి 10వ సీజన్ మొదలయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్) -
BB 10 లోకి శివ్ కుమార్.. ఆ సీక్రెట్ రివీల్..?
-
నన్ను ‘బిగ్‌బాస్’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సారి సామాన్యులకు భారీగానే అవకాశం ఇచ్చే చాన్స్ ఉంది. దాదాపు 10 మంది వరకు తీసుకుంటారని సమాచారం. దీని కోసం ‘అగ్ని పరీక్ష’ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్ట్‌లు మొదలయ్యాయి. ఈ మేరకు వీడియోలు చేసి సోషల్ మీడియా వేదికగా ‘బిగ్‌బాస్’టీమ్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా విజ్ఞప్తి చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దానికి గల కారణం.. బిగ్‌బాస్‌లోకి తీసుకోమని విజ్ఞప్తి చేసిన వ్యక్తి ఓ పోలీసు అధికారి అవ్వడమే. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన ఎస్సై నాగార్జున రెడ్డి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బిగ్‌బాస్ టీమ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు. తాను ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీసు స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని, ఒక్క అవకాశం ఇచ్చి బిగ్‌బాస్ షోలోకి తీసుకుంటే తన టాలెంట్ నిరూపించుకుంటానని చెబుతున్నాడు. బిగ్ బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే ‘బిగ్‌బాస్’ వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. ‘పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ నిత్యం ఎన్నో సవాళ్లను, మానసిక ఒత్తిడిని తట్టుకుని డ్యూటీ చేస్తున్నాను. నాకు గనుక బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఇస్తే.. అక్కడ ఉండే ఎలాంటి మైండ్ గేమ్స్ అయినా ఆడగలను, నాలోని లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో నిరూపించుకుని సత్తా చాటుతా అని నాగార్జున రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిగ్ బాస్ సీజన్-10లో నాకు అవకాశం కల్పించండి అంటూ నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో తన కూతుర్ల కోరిక మేరకు ఈ వీడియో చేశానని, షోలో సత్తా చాటుతానని పేర్కొన్న ఎస్ఐ#BigBossTelugu #NandyalSI #ViralVideo #BigBossSeason10 #TrendingNews #PoliceOfficer #RTV pic.twitter.com/myUku9UlPI— RTV (@RTVnewsnetwork) June 25, 2026 -
Bigg Boss 10: ‘బిగ్‌బాస్’లోకి ఫేమస్ ఫోక్ సింగర్, కంటెస్టెంట్స్ వీళ్లే!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్’ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల రిలీజ్ చేసి, ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తారని అధికారికంగా ప్రకటించారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్‌ని ప్లాన్ చేశారట మేకర్స్. దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్స్‌ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందులో దాదాపు సగం మంది అంటే 10 మంది వరకు కామనర్సే ఉండే అవకాశం ఉంది. గత సీజన్లలో కామరన్స్ తమదైన ఆటతో అదరగొట్టేశారు. సీజన్ 9కి విజేతగా నిలిచిన కల్యాణ్ కూడా కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చినవాడు. అందుకే 10వ సీజన్లో ఎక్కువ మంది కామనర్స్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయట. ఇవన్నీ పరిశీలించి.. అందులో నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జులై 25 నుంచి అగ్ని పరీక్ష 2ని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ 10వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో పాల్గొనే సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి 10 మంది సెలెబ్రిటీలను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించే అవకాశం ఉంది. వారిలో బుల్లితెర నటి పల్లవి గౌడ, రాకింగ్ రాకేష్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ పవిత్ర , నూకరాజు, ప్రభాకర్ లేదా ఆయన కొడుకు చంద్రహాసన్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, రచయిత కడలి సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.తాజాగా ఈ లిస్ట్‌లోకి సింగర్ మంగ్లీ కూడా వచ్చి చేరింది. ఇటీవల ఈ ఫోక్ సింగర్ వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ, అధిక వడ్డీ పేరుతో చేసిన ఘరానా మోసాల వంటి కేసుల విషయాల్లో వార్తల్లో నిలిచిన మంగ్లీ.. సీజన్ 10లో పాల్గొని..తనపై వచ్చిన నెగెటివిటీని పొగొట్టుకోవాలని ప్రయత్నిస్తుందట. గతంలోనూ ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు తనకు ఆసక్తి లేదని చెప్పిందట. ఈ సారి మాత్రం పాల్గొనే అవకాశం ఉంది. -
సామాన్యులకు వెల్కమ్.. బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు రెడీనా?
బుల్లితెర ప్రియుల రియాలిటీ షో బిగ్‌బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తొమ్మిది సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో పదో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కింగ్ నాగార్జున్ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేశారు.అయితే ఈ సారి కూడా సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. గతేడాది మాదిరే అగ్ని పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు వరకు ఆడిషన్‌కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు గరిష్ఠంగా మూడు నిమిషాల వరకు ఉండవచ్చని తెలిపారు. మీ వీడియోలను https://bbtelugu.jiostar.com సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్‌ను బయటకు తీసి వీడియోలు పంపి బిగ్‌బాస్ ఛాన్స్ కొట్టేయండి. -
‘బిగ్‌బాస్ 10’ వచ్చేస్తోంది.. పాటతో ప్రకటన..వీడియో వైరల్!
‘బిగ్‌బాస్’ అభిమానులకు గుడ్ న్యూస్. బిగ్‌బాస్ 10వ సీజన్ రాబోతుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే 10వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు నిర్వాహకులు. 10వ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.‘బిగ్‌బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’అంటూ నాగార్జున చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో స్పెషల్ వీడియో ప్రారంభం అవుతుంది. బిగ్‌బాస్‌పై రూపొందించిన ఓ ప్రత్యేక పాటతో వీడియో ఆద్యంతం అలరించేలా సాగుతుంది. చెదరని ప్రస్థానం..తరగని అభిమానం బిగ్‌బాస్ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్‌బాస్ దశావతారం’ అంటూ సీజన్ 10పై ఆసక్తిని పెంచేశాడు నాగార్జున. ఇక ప్రతి సీజన్ ఏదో ఒక క్యాప్షన్‌తో వచ్చే బిగ్‌బాస్.. ఈ సారి కూడా ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే క్యాప్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? కంటెస్టెంట్స్ ఎవరనే విషయాలను మాత్రం ప్రకటించలేదు. -
Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!
బిగ్‌బాస్ షోలో ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న తెలుగు సీజన్లోనూ శివాజీ చాలారోజుల క్రితం ఇలానే గాయపడ్డాడు. తాజాగా కన్నడ సీజన్లోనూ ఇంనతకంటే పెద్ద ప్రమాదం జరిగింది. నిర్వహకులు పెట్టిన ఓ పిచ్చి టాస్క్ వల్ల యంగ్ హీరోయిన్ చావు అంచుల దాకా వెళ్లొచ్చింది. ఇంతకీ ఏమైంది? ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ కాగా కన్నడలోనూ 10వ సీజన్ ప్రసారమవుతోంది. గతవారం ఓ టాస్క్ సందర్భంగా.. సర్ఫ్ కలిపిన నీళ్లని కంటెస్టెంట్స్‌పై ముఖంపై కొట్టారు. మిగతా వాళ్లు తట్టుకోగలిగారు. కానీ సంగీత శృంగేరి, డ్రోన్ ప్రతాప్ కళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీళ్లని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. తాజా వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా సంగీత, ప్రతాప్.. నల్ల కళ్లజోడు ధరించి రీఎంట్రీ ఇచ్చారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) చావు అంచుల దాకా 'చార్లి 777' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత.. బిగ్‌బాస్ షోతో మరింత పేరు తెచ్చుకోవాలని అనుకుంది. ఇప్పుడు అనుకోని విధంగా ప్రమాదం జరగడంతో బాగా బెదిరిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? అని హోస్ట్ కిచ్చా సుదీప్ అడగ్గా.. 'టాస్క్ అవుతున్నప్పుడు చాలా నొప్పిగా అనిపించింది. సూదులతో కంట్లో గుచ్చుతున్నట్లు చాలా పెయిన్ వచ్చింది. ఇక చికిత్స జరుగుతున్నప్పుడైతే చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫీలింగ్ వచ్చింది' అని సంగీత తన బాధంతా చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే సంగీత-ప్రతాప్ ఇద్దరూ కూడా షోలో కాస్త చలాకీగానే పాల్గొంటున్నారు. బహుశా కొన్నిరోజులు మెడిసన్ తీసుకుని, జాగ్రత్తగా ఉంటే సెట్ అయిపోతారనిపిస్తోంది. ఏమైనా సరే బిగ్‌బాస్ కనీస జాగ్రత్త తీసుకోకుండా పెట్టిన ఓ పిచ్చి టాస్క్ వల్ల ఇద్దరు కంటెస్టెంట్స్ ప్రాణాల మీదకు వచ్చింది. (ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్) -
బిగ్‌బాస్ షో.. ఈ వారం స్పెషల్ కంటెస్టెంట్ ఎలిమినేట్!
బిగ్ బాస్ రియాలిటీ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. బుల్లితెరపై ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం బిగ్‌బాస్ హవా నడుస్తోంది. ఈ ఏడాది కన్నడలో సీజన్- 10 నడుస్తోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో.. ఈ వారంలో ట్రాన్స్‌జెండర్ మహిళ నీతూ వనజాక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. దాదాపు 50 రోజులపాటు హౌస్‌లో ఉన్న నీతూ ఏడోవారంలో బయటకొచ్చేసింది. అయితే ఈ వారంలో ఆమెనే హౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఎలిమినేషన్ తర్వాత ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతూ తన అభిప్రాయాలను వెల్లడించింది. బిగ్‌బాస్ హోస్లో 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కంటెస్టెంట్‌గా నేను ఎక్కువ రోజులు ఉన్నందుకు గర్వపడుతున్నా. ఎన్నో అనుభవాలతో ఇంటికి వెళ్తున్నా. ఈ అనుభవాలతో మరింత ముందుకు సాగుతా. మీరు బయటకు వస్తారని నేను ఊహించా. గత రెండు వారాలుగా నా పనితీరు చాలా తక్కువగా ఉంది. కానీ కెప్టెన్సీ టాస్క్‌లో బాగా ఆడాను. కానీ దురదృష్టం నన్ను వెంటాడింది. హౌస్‌లో ఉన్న ప్రతాప్, తుకలి సంతోష్, సంగీత, కార్తీక్, తనీషా ఈసారి బిగ్ బాస్ టాప్ ఫైవ్‌లో ఉంటారు. ఈ సీజన్ విన్నర్‌గా ప్రతాప్ నిలుస్తాడంటూ నీతూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ అవకాశంపై మాట్లాడుతూ.. 'నాకు ప్రేమ కావాలి కానీ.. సానుభూతి అవసరం లేదు. బిగ్‌బాస్‌లోకి రావడం మంచి అవకాశం. ఇంట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ఈ ఈ జ్ఞాపకాలను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. అలాగే ట్రాన్స్జెండర్ల జీవితం గురించి చాలా మందికి తెలియదు. మేం ఏమి కోరుకుంటున్నామో, సమాజం నుంచి ఏమి ఆశిస్తున్నామో కూడా తెలియదు. చివరికి మాకు కావలసింది ప్రేమ మాత్రమే. మాకు ఎవరీ జాలీ, దయ అక్కర్లేదు. ప్రేమను పంచితే చాలు. అది నాకు బిగ్ బాస్ హౌస్ ఇచ్చింది.' అని అన్నారు. -
'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు
బిగ్‌బాస్ పేరు చెప్పగానే చాలామందికి గొడవలే గుర్తొస్తాయి. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ ప్రసారమవుతోంది. శివాజీ దగ్గర నుంచి శోభా వరకు అందరూ కప్ కొట్టడమే టార్గెట్ పెట్టుకుని మరీ ఆడుతున్నారు. మరోవైపు కన్నడలోనూ 10వ సీజన్ నడుస్తోంది. అయితే తెలుగుతో పాటు కన్నడ షోలో వివాదాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్‌పై ఏకంగా పోలీస్ కేసు నమోదైంది. ఏంటి విషయం? 'ఈగ' ఫేమ్ సుదీప్.. కన్నడలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకి హౌస్ట్‌గా చేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ షోలో ఓ కంటెస్టెంట్ పులిగోరుతో ఉన్న లాకెట్ వేసుకోవడం గమనించిన పోలీసులు.. షో జరిగే చోటుకి వచ్చి మరీ అతడ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఓ లేడీ కంటెస్టెంట్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) అసలేం జరిగింది? నవంబరు 8న ప్రసారమైన బిగ్‌బాస్ ఎపిసోడ్లో భాగంగా తనీషా అనే లేడీ కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్ ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్‌తో మాట్లాడుతూ.. 'వడ్డా' అని పిలిచింది. దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ.. తనీషాతోపాటు సదరు టీవీ ఛానెల్‌పై పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలోనే షెడ్యూల్డ్ కులాలు-షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వడ్డా అనేది షెడ్యూల్డ్ కులాల విభాగంలోకి వచ్చే భోవి సంఘంలో ఓ భాగం. అయితే బిగ్‌బాస్ షోలో ఇలా భోవి వర్గాన్ని కించపరుస్తూ కామెంట్స్ చేయడం ఇది రెండోసారి అని పద్మ, తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. గత సీజన్లో నటుడు సిహి కహీ చంద్రు కూడా ఇదే పదాన్ని అన్నప్పటికీ, ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) -
బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు బిగ్ షాక్.. షో మధ్యలోనే అరెస్ట్!
బిగ్ బాస్ రియాలిటీ షో టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. తమిళంలో స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆసక్తికరంగా సాగుతున్న కన్నడ బిగ్‌బాస్ షోలో ఊహించని సంఘటన ఎదురైంది. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్- 10 కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ షోలో పాల్గొన్న సంతోష్ పులి పంజా ఉన్న లాకెట్‌ను ధరించి కనిపించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అటవీశాఖ అధికారులు బిగ్ బాస్ సెట్స్‌కు చేరుకుని లాకెట్‌ను పరిశీలించారు. (ఇది చదవండి: ప్రభాస్ పుట్టినరోజు.. కన్నప్ప చిత్రబృందం స్పెషల్ పోస్టర్!) లాకెట్‌ను పరిశీలించిన అనంతరం.. అది అసలైన పులిదేనని అని నిర్ధారణకు వచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు వర్తూర్ సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్నీ వివరాలు రాబట్టేందుకు లాకెట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ విషయంపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ని అతను ఉల్లంఘించారని.. నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల శిక్ష పడుతుందని తెలిపారు. కాగా.. వర్తూరు సంతోష్ కర్ణాటకలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అఖిల భారత గోసంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత ఫేమస్ అయ్యారు. అక్టోబర్ 8న 2023న బిగ్ బాస్ కన్నడ సీజన్- 10 హౌస్‌లో అడుగుపెట్టారు. (ఇది చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో మేనల్లుడు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత!) -
'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?
'బిగ్‌బాస్' రియాలిటీ షోలో టీమిండియా స్టార్ క్రికెటర్. అవును మీరు విన్నది నిజమే. గతంలో హిందీ సీజన్లో శ్రీశాంత్ పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ దక్షిణాది బిగ్‌బాస్ రియాలిటీ షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇంతకీ ఎవరీ ఆటగాడు? ఏంటి సంగతి? బిగ్‌బాస్‌లోకి ఆ బౌలర్ బిగ్‌బాస్ షోలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొంటారు. కుదిరితే గెలుస్తారు. లేదంటే మధ్యలో ఎలిమినేట్ అయిపోతారు. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న ఏడో సీజన్లో మాత్రం దాదాపుగా అందరూ నటులే వచ్చారు. కానీ అక్టోబరు 8 నుంచి మొదలయ్యే కన్నడ సీజన్లో మాత్రం భారత మాజీ బౌలర్ వినయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వనున్నాడట. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) కన్ఫర్మే కానీ? వినయ్ కుమార్.. టీమిండియా తరఫున 31 వన్డేలు, 9 టీ20లు, ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 48 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో కోల్‌కతా, ముంబై, బెంగళూరు జట్లకు ఆడాడు. చివరగా 2013లో జాతీయ జట్టుకు ఆడాడు. 2021లో మొత్తానికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. మరి ఇది నిజమా కాదా? ఒకవేళ హౌసులోకి వస్తే ఏం చేస్తాడనేది చూడాలి? తెలుగు సీజన్ సంగతేంటి? తెలుగు సీజన్లో ప్రస్తుతం నాలుగో వారం నడుస్తోంది. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయారు. మిగతా 11 మందిలో ఈ వారం ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వాళ్లలో రతిక, టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే నాలుగో పవరస్త్ర కోసం యవర్, ప్రశాంత్, శుభశ్రీ పోటీలో ఉన్నారు. వీళ్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? పవరస్త్ర గెలుచుకునేది ఎవరో చూడాలి? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) -
'ఏంటి సార్ కొత్త ఫోనా'.. ఆసక్తి పెంచుతోన్న బిగ్ బాస్ ప్రోమో!
తెలుగువారిని అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటివారం కాస్తా నెమ్మదిగా సాగిన బిగ్‌బాస్ షో.. రెండోవారం నుంచే హాట్‌హాట్‌గా మారిపోయింది. అయితే తెలుగులో ఏడో సీజన్ కాగా.. కన్నడలో బిగ్ బాస్ సీజన్ 10కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. త్వరలో ప్రారంభం కానున్నట్లు ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2వ తేదీన సుదీప్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో కిచ్చా కనిపించలేదు. దీంతో మరోసారి స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే బిగ్‌బాస్ శాండల్‌వుడ్ అభిమానులకు సందడి చేయనుంది. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం! ) సరికొత్తగా ప్రోమో బిగ్ బాస్ ప్రతి సీజన్‌కు విడుదల చేసే ప్రోమోలు కాస్తా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోను రిలీజ్ చేశారు. సరికొత్త "ఏంటి సార్ కొత్త ఫోన్" అని ఓ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్‌ను అడిగాడు యువకుడు. అవును సార్ నా కొడుకు పండగకి కొనిచ్చాడు. అని చెప్పగానే ప్రోమోలో సుదీప్ కనిపించాడు. ఆ తర్వాత అదే యువకుడు ఆటో ఎక్కి ఇంటికి వెళ్తే.. పండగ మొదలవుతోంది సార్ అంటూ ఆటోడ్రైవర్ నుంచి సమాధానం వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీధి అంతా పండుగలా కనిపిస్తుంది. ఏంటిరా ఇందతా సందడి అని అక్కడి యువకులను అడుగుతాడు. వారంతా ఇది వందరోజుల పండగ అని సమాధానమిస్తారు.' ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 లుక్ చూపించారు. సుదీప్ కనుసైగ చేస్తూ "హ్యాపీ బిగ్ బాస్" త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది అంటూ సుదీప్ ఫోటోను ఆవిష్కరిస్తూ సందడి చేస్తూ కనిపించారు ఫ్యాన్స్. కంటెస్టెంట్స్ ఎవరు? అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ లిస్ట్ లో పది మందికి పైగా పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియరాలేదు. త్వరలోనే ఈ షో ప్రారంభమైన తర్వాతే ఆ క్యూరియాసిటీకి బ్రేక్ పడనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి) ಊರ ಹಬ್ಬಕ್ಕೆ ಇಲ್ಲಿದೆ ರೀಸನ್; ಶುರುವಾಗ್ತಿದೆ HAPPY 'BIGG BOSS KANNADA' ಹತ್ತನೇ ಸೀಸನ್! #BiggBossKannada #BBK10 #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ @KicchaSudeep pic.twitter.com/qCQkXGkQgI — Colors Kannada (@ColorsKannada) September 14, 2023 -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ కన్నుమూత
ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని రాజకీయ నాయకుడిగా చలామణి అయిన వ్యక్తి మృతి చెందాడు. ఆయన బిగ్‌బాస్ 10వ సీజన్లో పోటీదారుడిగా పాల్గొన్నాడు. మూడు నెలల కిందట కరోనా బారిన పడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 15 రోజులుగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయనే హిందీ బిగ్‌బాస్ షోలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి స్వామి ఓం. కరోనా బారిన పడినప్పటి నుంచి స్వామి ఓం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దీంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి కుమారుడు అర్జున్ జైన్, స్నేహితుడు ముఖేశ్ జైన్ తెలిపారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్‌లో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి ఓం 2017లో జరిగిన బిగ్‌బాస్ 10 షోలో అత్యంత వివాదాస్పదమయ్యాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్లపై మూత్ర విసర్జన చేయడం వైరలైగా మారింది. అతడి చర్యలు తీవ్రంగా ఉండడం. తోటి పోటీదారులు ఇబ్బందులు పడడంతో హోస్ట్‌గా ఉన్న సల్మాన్‌ఖాన్ అతడిని బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం స్వామి ఓం వైఖరిలో ఏం మార్పు రాలేదు. పైగా బిగ్‌బాస్ యాజమాన్యం, హోస్ట్‌గా వ్యవహరించిన సల్మాన్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్వామి ఓం 2008లో ఓ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన తనకు తాను దేవుడిగా అభివర్ణించుకుని హల్చల్ చేశాడు. -
సామాన్యుడు ‘బిగ్ బాస్’ అయ్యాడు
ముంబై: మూడు నెలల పాటు ఉత్కంఠభరితంగా సాగిన సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్-10లో సామాన్యుడు విజేతగా నిలిచాడు. హర్యానాకు చెందిన మన్ వీర్ గుజ్జర్ విజేతగా అవతరించాడు. తన స్నేహితుల పట్ల అతడు చూపిన నిజాయితీ, అంకితభావంతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు అతడికి మద్దతుగా నిలిచారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి, మోడల్, ఎంటీవీ వ్యాఖ్యాత గుర్బానీ జడ్జ్ ను దాటుకుని మన్ వీర్ ‘బిగ్ బాస్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మన్ వీర్ ను సల్మాన్ ఖాన్ విజేతగా ప్రకటించగానే అతడి తండ్రి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ప్రైజ్ మనీగా వచ్చే రూ. 40 లక్షల మొత్తాన్ని తన కుమారుడు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపాడు. సల్మాన్ ఖాన్ ఆర్గనైజేషన్ కు ఇస్తామని ప్రకటించాడు. తాను నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతానని మన్ వీర్ చెప్పాడు. ‘నేను గెలిచిన తర్వాత అందరూ నన్ను పొగుడుతున్నారు. నన్ను స్టార్ లా చూస్తున్నారు. సామాన్య వ్యక్తిలా ఉండడమే నాకు ఇష్టమ’ని మన్ వీర్ తెలిపాడు. బిగ్ బాస్-10 ముగింపు కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, యామి గౌతమ్ తో పాటు పోటీదారుల ఆటపాటలు అలరించాయి. -
తృప్తి దేశాయ్ కు ‘బిగ్ బాస్’ ఆఫర్
ముంబై: ఆలయాల్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కు ’బిగ్ బాస్’ ఆఫర్ వచ్చింది. వివాదస్పద సెలబ్రిటీ రియాలిటీ షో ‘బిగ్ బాగ్ 10’ లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని తృప్తి దేశాయ్ ధ్రువీకరించారు. అయితే ఒక షరతుపై ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమని ఆమె తెలిపారు. ఇందులో పోటీపడే వారందరూ మహిళలు ఉండాలని ఆమె షరతు పెట్టారు. తన షరతుకు అంగీకరిస్తే పాల్గొంటానని వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి బిగ్ బాగ్ 10 కార్యక్రమం ప్రారంభమవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి సామాన్యులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారని అంటున్నారు. సుల్తాన్, వ్యోమగామి వేషంలో సల్మాన్ ఖాన్.. ప్రొమోస్ లో కనిపిస్తున్నాడు. -
ఆస్ట్రోనాట్‌గా అగ్రహీరో!
'చంద్రుడిపై మనిషి తొలిసారి అడుగుపెట్టినప్పుడు.. గుడ్డు నుంచి కోడిపిల్ల తొలిసారిగా పుట్టినప్పుడు సరికొత్త చరిత్ర నమోదైంది. అదేవిధంగా తొలిసారి సామాన్యులు బిగ్‌బాస్ షోలోకి రాబోతున్నారు. ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుందా? లేక మిస్టరీనా?' అంటూ సల్మాన్ ఖాన్ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. దేశంలో అత్యంత వివాదాస్పదమైన పాపులర్ టీవీ షో 'బిగ్‌బాస్' తాజా ప్రోమోలో ఆస్ట్రోనాట్‌గా సల్మాన్ కనిపించాడు. వ్యోమగామిగా కనిపిస్తూ.. బిగ్‌బాస్-10 షోలో తొలిసారిగా సెలబ్రిటీలు ఉండబోరని, మొత్తం సామాన్యులతో ఈసారి షో నిర్వహిస్తున్నట్టు తెలిపాడు. మిడ్ సెప్టెంబర్‌లో కలర్స్ చానెల్లో ఈ షో ప్రసారం కానుంది.


