ఈవారం బిగ్‌బాస్ హౌస్‌లో రోడ్ టూ రీలోడ్ అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని గేమ్స్ పెట్టగా.. అందులో గెలిచిన ఓ ఇద్దరు.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యారు. అలానే తక్కువ పాయింట్ల కారణంగా రోహిత్-షాలిని డేంజర్ జోన్‌లో పడ్డారు. ఇంతకీ గురువారం(అక్టోబర్ 08) రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయనేది హైలైట్స్‌లో చూద్దాం.
గత వీకెండ్‌లో గిఫ్టులు గెలుచుకున్న ఝాన్సీ, ముకేశ్‌కి బిగ్‌బాస్.. హ్యాండ్‌బ్యాగ్, షూ పంపించాడు. తర్వాత చరణ్.. దేబ్జానీని కాసేపు ఫ్లర్ట్ చేశాడు. త్రిగుణ్, రోహిత్, షాలినిల దగ్గరకు వచ్చి అపూర్వ గురించి మాట్లాడాడు. మరోవైపు బిగ్‌బాస్.. నామినేషన్లలో ఉన్నవాళ్లని జంటలుగా విడగొట్టి స్టెప్ రోల్ గోల్ గేమ్ పెట్టాడు. ఇందులో ఆర్డర్ ప్రకారం గెలిచిన వాళ్లకు పాయింట్లు వస్తాయని చెప్పాడు. రాంప్రసాద్ టాస్క్‌ని మొదట పూర్తిచేశాడు. ఓవరాల్‌గా ఆట పూర్తయ్యేసరికి అమన్, రాంప్రసాద్, ముకేశ్, షాలిని, అపూర్వ.. వరసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. దీంతో అమన్ టీంకి 100, రాంప్రసాద్ టీంకి 80, ముకేశ్ టీంకి 60, షాలిని టీంకి 40, అపూర్వ టీంకి 20 పాయింట్లు లభించాయి.
గేమ్ మధ్యలో ఉన్నప్పుడు గదిలోకి అపూర్వ రాగానే మేం మాట్లాడుకోవాలి మాకు ప్రైవసీ ఇవ్వండని రోహిత్ అనగానే అపూర్వ వెళ్లిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత రోహిత్ ఈ విషయం గురించి అపూర్వతో మాట్లాడి నేను నిన్ను అనలేదని చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ విషయమే నాకు గుర్తు లేదని అపూర్వ చెప్పింది. కానీ అనవసరంగా మధ్యలోకి వచ్చిన షాలిని.. అపూర్వతో గొడవ పెట్టుకుంది. దీంతో అపూర్వ-షాలిని కాసేపు తిట్టుకుని ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.
లీడర్ బోర్డ్‌లో 180 పాయింట్లతో మొదటి స్థానంలో అమన్-త్రిగుణ్ ఉండటంతో నామినేషన్ల నుంచి సేప్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. మూడో టాస్క్‌గా చిత్రం భళారే విచిత్రం ఇచ్చారు. మిగతా నాలుగు జంటలు ఇందులో పాల్గొన్నాయి. స్క్రీన్ మీద కొన్ని ఆర్డర్‌గా బొమ్మలు వచ్చాయి. సంచాలకులు వర్షిణి, అమన్, త్రిగుణ్ నెంబర్లు చెప్పగానే వాటిని జంటల్లోని ఒకరు ఓ బోర్డు మీద గీయాల్సి ఉంటుంది. తర్వాత చెప్పిన నంబర్ ప్రకారం డార్క్ యార్డ్ గదిలో ఉన్న వస్తువుని తీసుకొచ్చి సర్కిల్‌లో పెడితే కరెక్ట్‌గా పెట్టిన వాళ్లకు పాయింట్లు వస్తాయి. షాలిని, అపూర్వ, నరేశ్, ఝాన్సీలు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తే.. రోహిత్, చరణ్, రాంప్రసాద్, ముకేశ్‌లు సంచాలకులు చెప్పిన వస్తువులు తీసుకొచ్చి సర్కిల్‌లో పెట్టాలి.
మొదట డ్రాయింగ్ అర్థం కావడం లేదని బిగ్‌బాస్ మళ్లీ డ్రాయింగ్ వేయమని చెప్పాడు. బ్రేక్ టైంలో ఝాన్సీ, ముకేశ్‌కి అన్ని బొమ్మల పేర్లు చెప్పి చీటింగ్ చేసిందని షాలిని గొడవ పెట్టుకుంది. తర్వాత ముకేశ్, రోహిత్, చరణ్‌లని రెండో రౌండ్ బొమ్మ తేవడానికి సంచాలక్.. వాళ్ల ముగ్గురిని ఆపి కేవలం రాంప్రసాద్‌కే వెళ్లమని చెప్పారు. దాంతో మేం మాట్లాడలేదని రోహిత్, షాలిని గొడవపడ్డారు. రాంప్రసాద్‌కి ఛాన్స్ రావడంతో ఒక పాయింట్ వచ్చింది. మూడో రౌండ్‌లో ముకేశ్ బొమ్మ తెచ్చినా కౌంట్ చేయమని అన్నారు. నాలుగో రౌండ్ నుంచి అందరూ ఆడారు. ఈ గేమ్‌లో ముకేశ్ ఒకటి కరెక్ట్ చెప్పగా.. రోహిత్ రెండు, చరణ్ రెండు, రాంప్రసాద్ ఐదు బొమ్మలు సరిగ్గా చెప్పాడు. ఎక్కువ కరెక్ట్‌గా చెప్పడంతో రాంప్రసాద్, నరేశ్ మొదటి స్థానంలో నిలిచారు. వీళ్లకి మొత్తం 220 పాయింట్లు వచ్చాయి. అపూర్వ-చరణ్ 200, ముకేశ్-ఝాన్సీ 160, రోహిత్-షాలిని 140కి లభించాయి. అలా గురువారం నాటి ఎపిసోడ్ ముగిసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక బట్టి చూస్తే రోహిత్-షాలిని డేంజర్ జోన్‌లో ఉన్నారు.


