తెలుగు సినిమాల్లో విలన్, విలన్ గ్యాంగ్‌లోని పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. 12 వారాల పాటు ఉన్న ఇతడు.. ఈ వీకెండ్ ఎలిమినేషన్‌లో భాగంగా బయటకొచ్చేశాడు. మరి ఇన్నాళ్లు ఉన్నందుకుగానూ రెమ్యునరేషన్ ఎంత దక్కింది? ఎలిమినేషన్‌కి కారణాలేంటి?
పెద్దగా అంచనాల్లేకుండానే 10వ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా టెంపర్ వంశీ.. మరీ గొప్పగా కాకపోయినా ఉన్నంతలో తన ఆటతో పర్లేదనిపించాడు. పరిస్థితులు కలిసి రావడంతో ఒకటి రెండు సార్లు చివరివరకు వెళ్లి బయటపడ్డాడు. తర్వాత పర్లేదనిపించే ఆటతో 12 వారాలు నెట్టుకొచ్చేశాడు. ఈసారి ఎలిమినేట్ అయ్యాడు.
అయితే స్టేజీపైకి వచ్చిన తర్వాత బాధపడటం, ఎమోషనల్ కావడం లాంటివి వంశీ విషయంలో ఏం జరగలేదు. స్టేజీపైకి వచ్చాడు. తన జర్నీ వీడియో చూశాడు. ఎలాగైనా కప్పు కొట్టాలని త్రిగుణ్‌తో చెప్పి వెళ్లిపోయాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షల చొప్పున 12 వారాలకుగానూ రూ.24 లక్షల రెమ్యునరేషన్ ఇతడు అందుకున్నట్లు తెలుస్తోంది.


