ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్ 12వ వారం ఎండింగ్‌కు వచ్చేస్తోంది. ఈ వీక్‌లో బడ్డీ అప్ థీమ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. వారితోనే గేమ్స్ ఆడించి కెప్టెన్సీ కంటెండర్స్‌ను ఎంపిక చేస్తున్నారు బిగ్‌బాస్. అలా గురువారం హౌస్‌లో మరో ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఈ ఎపిసోడ్‌లో వీజేసన్నీ, సిరి హనుమంత్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరు బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో పాల్గొన్నారు.
హౌస్‌లోకి వచ్చి రాగానే వీజే సన్నీ తనదైన స్టైల్లో అలరించాడు. హౌస్‌మేట్స్ అందరికీ సూచనలు ఇస్తూనే వారిలో బలాలు, బలహీనతలను బయటపెట్టేశాడు. ముఖ్యంగా త్రిగుణ్‌కు ఇచ్చిపడేశాడు. త్రిగుణ్‌ను ఉద్దేశించి నువ్వు మంచోడివా చెడ్డోడివా అర్థం కావడం లేదే.. మంచి గేమ్ ఆడుతున్నావా? చెడ్డగేమ్ ఆడుతున్నావా అర్థం కావడం లేదే.. మంచోడని అనుకుంటే ఫ్రెండ్‌నే పొడుస్తావ్ ఏంటీ అంటూ.. అతని స్టైల్‌లోనే పనిదొంగా పాటని రీమిక్స్ చేసి కొట్టాడు. నీ గేమ్‌ని అంచనా వేయలేకపోతున్నామని అన్నాడు. ఆ తర్వాత సుధీర్ నువ్వు బ్రదర్ అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. మీ అమ్మ హౌస్‌లోకి వచ్చినప్పుడు మా మదర్‌లానే ఫీలయ్యానని వీజే సన్నీ సుధీర్‌ను హత్తుకున్నాడు.
ఆ తర్వాత వర్షిణి.. వర్షిణి.. వర్షిణీ ముకేష్ బాబు సంరక్షిణీ.. ఇక నుంచి నీ ఆట నిన్ను ఆడమనీ.. రిక్వెస్ట్ చేస్తున్నా.. నీ ఫ్రెండ్‌గా అంటూ ఆమెపై తనదైన స్టైల్లో పంచ్‌లు విసిరాడు సన్నీ. అనంతరం ముకేశ్ గురించి మాట్లాడాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. కానీ కప్పు ముఖ్యం బిగిలు అంటూ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత సుధీర్, ముకేశ్ ఉద్దేశించి మీ ఫ్రెండ్‌షిప్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే ఫ్రెండ్ షిప్‌ని కంటిన్యూ చేయండి అన్నాడు వీజే సన్నీ.
టాస్క్‌లో నరేశ్ విన్..
కెప్టెన్స్ కంటెండర్‌షిప్‌లో భాగంగా బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. నరేశ్, వీజే సన్నీ ఓ వైపు.. సిరి హనుమంతు, వర్షిణి ఓ వైపు నిలిచారు. ఈ గేమ్‌లో నరేశ్ టీమ్ గెలిచింది. దీంతో నరేశ్ వచ్చేవారం జరిగే కెప్టెన్ కంటెండర్‌షిప్ పోటీకి అర్హత సాధించాడు. ఈ టాస్క్‌లో కాస్తా మాటల యుద్ధం నడిచింది. అయితే నరేశ్ విన్ కావడంతో హౌస్‌మేట్స్ అందరూ అతన్ని అభినందించారు. ఈ గేమ్‌లో ఓటమిపాలైన వర్షిణి మాత్రం చిన్నపిల్లలా ఏడుస్తూ వీజే సన్నీ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. ముకేశ్ తప్ప నాకు ఎవరీ సపోర్ట్ ఉండందటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.
ఆ తర్వాత హౌస్‌లో పథ్వీరాజ్, నిఖిల్ అడుగుపెట్టారు. వీళ్లిద్దరు వచ్చిరాగానే హౌస్‌లో మీకు ఎవరితో స్ట్రాంగ్ బాండింగ్ ఉంది.. వారికోసం మీరు త్యాగం చేయడానికి సిద్ధమా అంటే ఎవరు చేస్తారని అడిగారు. దేబ్జానీ కోసం రామ్‌ప్రసాద్, నరేశ్ కోసం సుధీర్, ఆర్కే కోసం శివ, త్రిగుణ్ కోసం వంశీ త్యాగం చేయడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత త్రిగుణ్, వంశీలకు మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోమని సలహా ఇస్తాడు నిఖిల్. ఇప్పటికైనా గేమ్ సొంతంగా ఆడమని వర్షిణి, దేబ్జానీకి సూచిస్తాడు. ఎవరో చెప్తే ఎవ్వరూ మారరు. మీరు మీలా ఉండండి.. ఇక్కడి వరకు వచ్చారంటేనే మీరంతా విన్నర్స్ అని నిఖిల్ అందరినీ ప్రశంసిస్తాడు.
ఇక చివరగా కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం బిగ్‌బాస్ పోటీ పెట్టారు. బిల్ట్ పిరమిడ్ అనే టాస్క్ హౌస్‌మేట్స్ ముందుకు తీసుకొచ్చారు. అలా సుధీర్- నిఖిల్, వంశీ - పృథ్వీ రెండు టీమ్‌లుగా ఆడతారు. ఈ గేమ్‌కు త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించాడు. ఈ టాస్క్‌లో సిలిండర్లను అన్ లాక్ చేయడంతో సుధీర్ బాగా ఆడతాడు. కానీ వంశీ ఫెయిల్ అవుతాడు. అలా సుధీర్‌లానే నిఖిల్ కూడా పిరమిడ్‌ను ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తాడు. అలా చివరకు కెప్టెన్సీ రేసులోకి ఆర్కే, శివ్, దేబ్జానీ, అమన్, నరేశ్, సుధీర్ నిలిచారు. మరి హౌస్‌లో చివరి కెప్టెన్ ఎవరు అవుతారో ఇవాళ తేలిపోనుంది.


